న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ జెఇ ప్రవేశం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఇ) ప్రక్షాళనకు నడుం బిగించింది. అందులో 47 మంది అధికారులను తొలగిస్తూ కేంద్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. వారిపై లీగల్, క్రిమినల్ చర్యలకు చేసింది. ప్రక్షాళనలో ఇది తొలి అడుగని, మొత్తం నెల రోజుల్లో ఎన్‌టిఎ ప్రక్షాళన పూర్తవుతుందని విద్యాశాఖ. భవిష్యత్‌లో పేపర్ల లీకులకు అవకాశం లేకుండా ఔట్సోర్సింగ్ విధానంలో మార్పులు చే యాలని నిర్ణయించినట్లు. కాగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన రాజీనామా చేయాలంటూ విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ, ఆయనను పదవి నుంచి తప్పించే ప్రసక్తే లేదు.
కేంద్ర ప్రభుత్వం. శుక్రవారంనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన మంత్రివర్గం సమావేశంలో ప్రధాన్‌కు అండగా నిలిచినట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలోని అత్యున్నతస్థాయి వర్గాల సమాచారం పేరుతో జాతీయ మీడియాలో ఈ మేరకు కథనాలు వెలువడ్డాయి. ‘రాజీనామా చేయించడం అన్నింటికంటే సులభమైన నిర్ణయం. కానీ ప్రభుత్వం మంత్రికి అండగా ఉంది. ప్రజలు మాకు అధికారం అప్పగించారు. వారికి ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం’ అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఉన్నత స్థా యి వ్యక్తి తెలియజేసారు. అయితే, ఎన్టీఏలో ఉన్న సమస్యలను గుర్తించి ప్రక్షాళన జరపాలని ప్రభు త్వం భావిస్తున్నట్లు తెలిపారు. ప్రశ్నపత్రాల లీకేజీలకు అనేక ముఠాల గుట్టు రట్టు చేశామని, మరిన్ని చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నామని తెలిపారు.

