విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : మండల పరిధిలోని కేశేపల్లి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్లో స్కౌట్ విద్యార్థులు అందించిన సేవలకు విశేష ప్రశంసలు లభించాయి. స్కౌట్ మాస్టర్ డి. ఆంజనేయులు నాయక్ మార్గదర్శకత్వంలో విద్యార్థులను ఆహ్వానించడం నుండి సహపంక్తి భోజనాల నిర్వహణ వరకు క్రమశిక్షణ, సేవాభావంతో తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారు. హాజరైన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థుల అంకితభావాన్ని అభినందించారు. ఈ సందర్భంగా అందించిన స్కౌట్ విద్యార్థులను స్కౌట్ మాస్టర్ డి. ఆంజనేయులు నాయక్ ప్రత్యేకంగా అభినందిస్తూ, భవిష్యత్తులోనూ ఇదే సేవాస్ఫూర్తితో సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు.
పోస్ట్ సేవాభావంతో ఆకట్టుకున్న స్కౌట్ విద్యార్థులు… మొదట కనిపించింది విశాలాంధ్ర.

