ఢిల్లీ : కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా విద్యార్థులు సాధించిన విజయమని రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ తప్పులు చేశారన్నారు. కొన్నేళ్లుగా విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించారని రాహుల్ గాంధీ చెప్పారు. ఆందోళన చేసిన విద్యార్థుల పట్ల అమానుషంగా వ్యవహరించడమే కాకుండా లాఠీ ఛార్జి కూడా చేశారని రాహుల్ అన్నారు.
ప్రశ్నపత్రం లీకేజీపై దేశమంతటా ఒకటయిందని రాహుల్ గాంధీ చెప్పారు. ఏకతాటిపై నడిచిందని అన్నారు. విద్యావ్యవస్థలో మార్పులకు సమగ్రమైన అడుగులు పడాలని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. అవినీతికి ధర్మేంద్ర ప్రదాన్ మూలకారణమని అన్నారు. ఇది పాలకులకు ఒక హెచ్చరిక అని, కానీ ప్రతిపక్షానికి కూడా ఇక వార్నింగ్ లాంటిదని రాహుల్ గాంధీ మీడియా ఎదుట ఉన్నారు.

