– ప్రకటన –
నవతెలంగాణ-సత్తుపల్లి
హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఆదివారం జరిగిన తెలుగు సాహితీ వనం 9వ వార్షికోత్సవంలో సత్తుపల్లికి చెందిన బాలసాహిత్య రచయిత ఆవుల పోతురాజు ‘స్నిగ్ధారెడ్డి బాలసాహిత్య’ పురస్కారాన్ని అందుకున్నారు. తెలుగు సాహితీ వనం నిర్వాహకులు శాంతికృష్ణ అధ్యక్షతన ఈ వేడుకలో డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, డాక్టర్ అంపశయ్య నవీన్, డాక్టర్ పెద్దింటి అశోక్ కుమార్ ఈ సభలో పాల్గొని పోతురాజు అభినందిస్తూ ప్రసంగించారు. పేద కుటుంబంలో జన్మించిన పోతురాజు బాల సాహిత్యంలో చేస్తున్న కృషిని కొనియాడారు. అతని చదువు కోసం అప్పటికప్పుడే రూ.12వేలు ఆర్థిక సహాయాన్ని అందించారు.
పోతురాజులోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన తెలుగు టీచర్ రమాదేవిని ఈ సందర్భంగా అభినందించారు. రవీంద్ర భారతిలో పురస్కారం అందుకున్న పోతురాజు సత్తుపల్లిలోని పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, ఆషా స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్, గార్లపాటి-బొల్లేపల్లి ట్రస్ట్ నిర్వాహకులు రామకృష్ణ, మధుసూధనరాజు, సృజన సంస్థ నిర్వాహకులు గట్టే, వాసు, ఆడమ్స్, పసుపులేటి నాగేశ్వరరావు, అయ్యాదేవర శేషగిరిశెట్టి మాదిరాజు మాలతి, సంఘ, నాయకులు కేశవరావు, డి. కృష్ణయ్య, నరసయ్య, బూరుగు దాసు పోతురాజులకు అభినందనలు తెలిపారు.
– ప్రకటన –

