– ప్రకటన –
యాదాద్రి రైస్ ఇండస్ట్రీలో 6,510 మెట్రిక్ టన్నుల ధాన్యంమాయం
ఒకరు అరెస్టు, నలుగురు పరార్
నవతెలంగాణ-భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లాలో రైస్ మిల్లు ధాన్యంలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. పౌర సరఫరాల శాఖ అధికారులు ఇటీవల తనిఖీ చేయగా 6,510 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు గుర్తించినట్లు సమాచా రం. ఈ మేరకు సుమారు రూ.21.31 కోట్ల నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనా.. భువనగిరి యాదాద్రి రైస్ ఇండస్ట్రీలో సంబంధిత అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఉండాల్సి న స్టాక్ 6,670 మెట్రిక్ టన్నుల ధాన్యం కాగా, 160 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే నిల్వతో 6,510 మెట్రిక్ టన్నులు మాయమైనట్టు పేర్కొంది. రిజిస్టర్లను పరిశీలించిన అనేక అవకతవకలు, లెక్కల్లో తేడాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.
కేసు నమోదు-అరెస్టులు
ఈ వ్యవహారంపై అధికారులు ఫిర్యాదు మేరకు భువనగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. యాదాద్రి రైస్ ఇండస్ట్రీలో మొత్తం ఐదుగురు పా ర్టనర్లు ఉన్నారు. అందులో ఒక నిందితుడు నూనె వెంకటేశ్వర్లను శనివారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన నలుగురు పరారైనట్టు సమాచా రం. పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలింపు చ ర్యలు చేస్తున్నారు. మిల్లును సీజ్ చేసి మిగిలిన 160 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంది.
విద్యా ఆగ్రో ఇండస్ట్రీస్ పై అనుమానాలు..!
ఈ కుంభకోణంలో 2024లో సుమారుగా 2,556 విద్యా ఆగ్రో ఇండస్ట్రీస్ రామన్నపేట నుండి యాదాద్రి రైస్ ఇండస్ట్రీకి తరలించినట్లు అధికారవర్గాల సమాచారం. వాస్తవంగా ఈ తరలించిన బుక్ ట్రాన్స్ పోర్టు తప్ప రైస్ మిల్లు వరకు చేరలేదని సమాచారం. యాదాద్రి ఇండస్ట్రీస్ తో పాటు విద్యా ఆగ్రో ఇండస్ట్రీస్ పై నా విచారణ జరిపే అవకాశం ఉంది.
మాయమైన ధాన్యం విలువ రూ.21.31కోట్లుగా అంచనా
మాయమైన 6,510 మెట్రిక్ టన్నుల ధాన్యం విలువ సుమారు రూ. 21.31 కోట్లుగా అంచనా వేశారు. ఈ ధాన్యాన్ని బయట మార్కెట్లో అమ్మి లబ్ది పొంది ఉంటారని అనుమానిస్తున్నారు. రిజిస్టర్లలో తారుమారు చేసి, ప్రభుత్వ స్టాక్‌ను సొంతం చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. మిల్లులో జరిగిన లావాదేవీలపై పూర్తి స్థాయి విచారణ. గత రెండేండ్ల రికార్డులను పరిశీలిస్తున్నారు. ఇందులో గతంలోని అధికారుల పాత్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలో అరెస్టు చేసి, ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని రికవరీ చేస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
– ప్రకటన –

