Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేసినప్పుడు.. యువతకు ఆహారం అందించాడు.. పండ్లు పంపిణీ చేశాడు.. భారీగా ఖర్చు పెట్టాడు. నిజానికి నెలకి 40 వేలు సంపాదించేవాడు ఈ స్థాయిలో ఖర్చుపెట్టడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇప్పుడు యూపీ పోలీసులు జునైద్ ఇంటికి వెళ్లారు. అతడి బ్యాంకు ఖాతాలను చూస్తున్నారు. ఈ స్థాయిలో డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ఆరా తీస్తున్నారు.
నీట్ ఉద్యమంలో పోలీసుల దాడి చాలావరకు విద్యార్థులే. ఆ విద్యార్థులు ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కానీ రీల్స్ చేసిన వారు.. షార్ట్స్ చేసినవారు దర్జాగా దండుకున్నారు. బ్రహ్మాండంగా లక్షలు వెనకేసుకున్నారు. వీళ్ళు మాత్రమే కాదు అభిజిత్ దీప్కే మొదట్లో టైఫాయిడ్ వచ్చిందని హడావిడి చేశాడు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయగానే.. ఫైవ్ స్టార్ హోటల్ కి వెళ్లి పార్టీలు చేసుకున్నాడు.
కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన ఆందోళనకు సంఘీభావం తెలుపడానికి వచ్చిన వారంతా జాతి విద్రోహక నినాదాలు ఇచ్చారు. రామాలయం ఎందుకు.. ఆర్టికల్ 370 ను పునరుద్ధరించాలి.. నేపాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం రావాలి. శ్రీలంక మాదిరిగా యువకులు వీధుల్లోకి వచ్చి కొట్లాటలు చేయాలి.. ఇలా ఉంది. చివరికి ఉగ్రవాదులకు సంఘీభావం తెలిపారు. అల్లా అక్బర్ అంటూ నినాదాలు చేశారు. వీరంతా కూడా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇక ముంబైలో విద్యార్థులను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పోలీసు వాహనానికి ఎదురుగా నిలబడి ఫోటోలకు ఫోజులు ఇచ్చిన యువతి.. సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ పెంచుకుంది. అంతేకాదు సబ్స్క్రయిబ్ రేటు కూడా నిర్ణయించింది. ఇప్పటికే ఆమె దాదాపు 8,000 మంది సబ్స్క్రైబర్లు పెరిగారు. ఈ లెక్కన ఆమె ప్రతినెలకు 11 లక్షలు సంపాదిస్తుంది.
ఇలా చెప్పుకుంటూ పోతే కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన ఆందోళనలో చాలామంది సొమ్ము చేసుకున్నారు. కొందరు మూడు పూటలా బ్రహ్మాండంగా తిన్నారు. ఫైవ్ స్టార్ వంటకాలను టేస్ట్ చేశారు. కానీ అసలైన నిరసనలు చేపట్టిన వారు కాళ్లు చేతులు విరగొట్టుకున్నారు.. ఆస్పత్రుల పాలయ్యారు. ఉద్యమకారులకు భారీగా ఖర్చు పెట్టుకున్న జునైద్.. ఇప్పుడు యూపీ పోలీసులకు సమాధానం చెప్పాలి. మిగిలిన వారు కూడా బ్యాంకు ఖాతాల వివరాలను సమర్పించాలి. కానీ రీల్స్ బ్యాచ్ మాత్రం.. ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. వచ్చిన డబ్బులను లెక్కపెట్టుకుంటూ నే ఉంటారు. ఎందుకంటే త్యాగాలు ఒకరివి.. భోగాలు మరొకరివి..

