జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలుసా. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ లో కనిపించినంతగా ఇప్పుడు టైం పడకపోవచ్చు కానీ ఫ్రెండ్ షిప్ అంత తేలిగ్గా మారిపోయేది కాదు. ఒకరి కోసం ఒకరు ప్రాణాలకు తెగించి సినిమాలో ఎలాంటి పోరాటాలు చేశారో చూశాం. అదేంటో నిజ జీవితంలో కూడా కాకతాళీయంగా రామరాజు, భీంలకు కొన్ని విషయాల్లో సారూప్యత వస్తోంది. అనుకోకుండా జరిగినా ఇది ఆశ్చర్యకరంగా ఉంది.
ఇవాళ సాయంత్రం జూనియర్ ఎన్టీఆర్ భుజానికి చిన్న శాస్త్ర చికిత్స జరిగింది. ఒక ప్రమాదం జరగకుండా ఆసుపత్రిలో చేరిన తారక్ నిపుణులైన వైద్యులు తక్షణం ట్రీట్ మెంట్ చేశారు. ఎనిమిది వారాల పాటు అంటే రెండు నెలలు పూర్తిగా రెస్టు తీసుకుంటే సరిపోతుందని, అభిమానులు సన్నిహితులు కుటుంబ సభ్యులు టెన్షన్ పడాల్సింది హాస్పిటల్ బులెటిన్. ఆ మేరకు అఫీషియల్ గా ఒక ప్రకటన వచ్చింది.
సరిగ్గా ఈ రోజే రామ్ చరణ్ కు కేరళలో ట్రీట్ మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. చిరంజీవి, సురేఖ, ఉపాసన దీని కోసమే తనతో పాటుగా తోడుగా వెళ్లారు. పెద్ది టైంలో తగిలిన దెబ్బలు తీవ్రం కావడంతో వైద్యులు సర్జరీ రికమండ్ చేశారు. థియేటర్ రన్ పూర్తయిపోయి ఓటిటిలో కూడా పెద్ది రావడంతో చరణ్ మీద ఎలాంటి బాధ్యత లేదు. అచ్చం తారక్ లాగే చరణ్ కూడా రెండు మూడు నెలలు సంపూర్ణ విశ్రాంతిలోనే ఉండాలి. ఫ్యాన్స్ కోరుకుంటున్నది ఇదే.
వీటి వల్లగన్, ఆర్సీ 17 తాలూకు షెడ్యూల్స్ ప్రభావితం చెందుతాయి కానీ ఎవరికైనా ముందు ఆరోగ్యం ముఖ్యం, ఇటీవలే బాలకృష్ణ తన 111 సినిమాలో గాయపడి హైదరాబాద్లో ఆపరేషన్ చేయించుకున్న సంగతి తెలిసిందే. ఆయనకూ విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారు. చూస్తుంటే ఈ గాయాలు పర్వం టాలీవుడ్ స్టార్లను వెంటాడుతున్నట్టు ఉంది. ఇక ఎవరికి ఇలాంటివి జరగకుండా ఉండాలని మూవీ లవర్స్ కోరుకుంటున్నారు. తారక్, చరణ్, బాలయ్య త్వరగా కోలుకోవాలంటే అందరి ఆకాంక్ష.

