అల్లు అర్జున్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులతో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో భావోద్వేగంగా మాట్లాడారు. అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేసి ఇంత ప్రేమ, ఆదరణ చూపిస్తున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పలేకపోయినా, వారందరూ తన మనసులో ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సందర్భంగా హాజరైనందుకు ఎంతో గర్వంగా ఉందని, అభిమానులకు “థాంక్యూ” చెబుతూ వారి ప్రేమకు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే “కీప్ ద ఫైర్ ఆన్” అంటూ అభిమానులను ఉత్సాహపరిచారు.
ఈ సందర్భంగా ఫ్యాన్స్, ఫ్యాన్స్, హేటర్స్ గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి మనిషికి ఒక రోజు 100 శాతం ఎనర్జీ, సమయం ఉంటుందని, దానిని ఎలా ఉపయోగించుకోవాలనేది పూర్తిగా వారి వ్యక్తిగత నిర్ణయమని చెప్పారు. “ఎవరైనా వారిని ద్వేషిస్తూ, ట్రోల్ చేస్తూ మీ సమయాన్ని వృథా చేసుకోకండి. మీకు ఉన్న సమయం, శక్తి, అవకాశాలను మీకు నచ్చిన పనికే వినియోగించుకోండి. నచ్చని విషయాల కోసం ఒక్క శాతం కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా హెటర్స్కు పరోక్షంగా ఇచ్చిన సందేశం, పాజిటివ్ ఆలోచనతో ముందుకు సాగాలన్న ఆయన మాటలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

