ICC T20 ప్రపంచ కప్: క్రికెట్‌ను ప్రపంచవ్యాప్తంగా మరింతగా విస్తరించేందుకు ఐసీసీ (ICC) ప్రణాళికలు రచిస్తోంది. టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం, 2032 నాటికి టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే జట్ల సంఖ్యను 20 నుంచి 24కు పెంచాలని ఐసీసీ భావిస్తోంది. అంతేకాదు, భవిష్యత్తులో ఈ టోర్నీని ఏకంగా 32 జట్లతో నిర్వహించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. 2024లో టీ20 ప్రపంచకప్‌ను 16 జట్ల నుంచి 20 జట్లకు విస్తరించింది.. 2024, 2026 ఎడిషన్లు భారీ విజయం సాధించడంతో, చిన్న జట్లకు (ఎమర్జింగ్ నేషన్స్) ప్రపంచ స్థాయి వేదికపై జట్లతో పోటీపడే అవకాశం కల్పించాలని ఐసీసీ చూస్తుంది.
క్రికెట్ విస్తరణకు టీ20యే కీలకం:
క్రికెట్‌ను విశ్వవ్యాప్తం చేయడానికి టీ20 ఫార్మాట్‌ను ఐసీసీ ప్రధాన ఆయుధంగా వాడుకుంటుంది. దీనికి తోడు ఏకంగా 126 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత క్రికెట్ మళ్లీ ఒలింపిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. చివరిసారిగా 1900 పారిస్ ఒలింపిక్స్‌లో ఆడిన క్రికెట్, ఇప్పుడు 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ ద్వారా తిరిగి ఒలింపిక్ వేదికపై మెరవనుంది.
2028, 2030 టోర్నీల పరిస్థితి ఏంటి:
రాబోయే 2028, 2030 టీ20 ప్రపంచకప్‌లు మాత్రం ఇప్పటిలాగే 20 జట్లతోనే జరగనున్నాయి. ఈ రెండు ఎడిషన్ల కోసం ఒక కొత్త ఫార్మాట్‌ను ఐసీసీ తీసుకొచ్చింది. కానీ 2032 నాటికి జట్ల సంఖ్యను 24కి పెంచే అవకాశం మాత్రం క్లీయర్ కనిపిస్తుంది.
ఐసీసీ ముందున్న ప్రధాన సభలు:
అయితే జట్ల సంఖ్యను 24 లేదా 32కు పెంచడం ఐసీసీకి అంత సులభమైన విషయమేమీ కాదు.. జట్లు పెరిగిన మ్యాచ్‌ల సంఖ్యతో పాటు టోర్నీ సమయం కూడా పెరుగుతుంది. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వివిధ ఫ్రాంచైజీ లీగ్‌లతో పూర్తి స్థాయిలో ఉన్నారు. ఇలాంటి సమయంలో ద్వైపాక్షిక సిరీస్‌లు (ద్వైపాక్షిక సిరీస్), పనిభారం (వర్క్‌లోడ్) దెబ్బతినకుండా టోర్నీని నిర్వహించడం ఐసీసీకి పెద్ద సవాలుగా మారనుంది. కానీ, ఈ టోర్నీ విస్తరణపై ఐసీసీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
🚨 క్రికెట్ గ్లోబల్‌గా మారుతోంది. 🚨
– ICC T20 ప్రపంచ కప్ 2032 నుండి 24 జట్లకు విస్తరించనుంది. త్వరలో దీనిని 32 జట్లుగా మార్చాలనేది ఆశయం. (టిమ్ విగ్మోర్). pic.twitter.com/FnAeNtVtSx
— ముఫద్దల్ వోహ్రా (@mufaddal_vohra) జూలై 27, 2026

