నాలుగు రోజులు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన చెన్నై లవ్ స్టోరీ తాలూకు కబుర్లు, ట్వీట్లే కనిపించాయి. మొదటి రోజు ప్రీమియర్ వేసినప్పుడు వచ్చిన పెరుగు మిశ్రమ స్పందన, ప్రతి షోకు వెళ్లిన కలెక్షన్లకు పొంతన లేకుండా పోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఇలాంటి ప్రేమకథలకు రెస్పాన్స్ తక్కువగా ఉండే సీడెడ్ మాస్ సెంటర్స్ లోనూ మంచి నెంబర్లు నమోదు చేయడం చిన్న విషయం కాదు. సోమవారం దాకా జోరు బాగానే ఉంది.
ఇవాళో రేపో యాభై కోట్ల మార్కు అందుకునేలానే తయారైంది. అయితే ఈ జోరు రెండో వీకెండ్ కూడా కొనసాగుతుందా లేదా అనే దాని మీదే బయ్యర్లు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఫీవర్ మాములుగా లేదు. టిక్కెట్ల కోసం యుద్ధాలే జరుగుతున్నాయి. షోలు ఎక్కడ పెట్టిన నిమిషాల్లో అమ్ముడుపోతున్నాయి. దీని దెబ్బకు చెన్నై లవ్ స్టోరీ రెండో వారం అగ్రిమెంట్లు చేసుకున్న స్క్రీన్లకు ఓవర్ ఫ్లోస్ వల్ల ప్లస్ అవ్వొచ్చనే అంచనా లేకపోలేదు.
ఒకవేళ చెన్నై లవ్ స్టోరీ నెమ్మదించినా నష్టమేం లేదు. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ దాటి లాభాల్లోకి వెళ్తోంది. సో స్పైడర్ మ్యాన్ వల్ల ఎఫెక్ట్ ఏదైనా ఉంటే అది కొత్తగా రిలీజవుతున్న శ్రీనివాస మంగాపురం, న్యూటన్ థర్డ్ లాకు తప్ప దీనికి కాదనేది కిరణ్ అభిమానుల అభిప్రాయం. ప్రమోషన్స్ పరంగా టీమ్ తన పనిని దాదాపుగా పూర్తి చేసింది. చిరంజీవి అతిథిగా ప్రీ రిలీజ్ ఈవెంట్, నాగ చైతన్య గెస్టుగా సక్సెస్ మీట్ అయిపోయాయి. ఇంతకన్నా పెద్దవి ఇక ఉండవు
నెక్స్ట్ బాక్సాఫిస్ రన్ చూస్తూ ఉండటం తప్ప చెన్నై బృందానికి పెద్దగా పనుండక పోవచ్చు. అయినా సరే థియేటర్ విజిట్స్ కొనసాగించాలని నిర్ణయించుకున్నారట. కిరణ్ అబ్బవరం, శ్రీగౌరీ ప్రియాతో పాటు టీమ్ ఆల్రెడీ ప్రకాశం సైడ్ వెళ్ళిపోగా తర్వాత లిస్టులో రాయలసీమ జిల్లాలు ఉన్నాయి. హీరో స్వంత ప్రాంతం కాబట్టి అక్కడేదైనా స్పెషల్ పబ్లిసిటీ చేస్తారేమో. రవి నంబూరి దర్శకత్వం వహించిన ఈ ఎమోషనల్ డ్రామాకు సాయి రాజేష్ నిర్మాణం ప్లస్ రచన చేసిన సంగతి తెలిసిందే.

