DMart Pharmacy: ఇప్పటికే ఇండియన్ రిటైల్ బిజినెస్ dmart మార్చేసింది. టైర్ 1, 2 మాత్రమే కాకుండా.. టైర్ 3 సిటీస్‌లో కూడా అవుట్లైట్లను ఏర్పాటు చేస్తోంది. చేయడం మాత్రమే కాదు.. అద్భుతమైన డిస్కౌంట్లు ఇస్తూ బిజినెస్ తనవైపు తిప్పుకుంటున్నది. పప్పుల దగ్గర నుంచి మొదలుపెడితే దుస్తుల వరకు.. వంట పాత్రల నుంచి మొదలు పెడితే బాత్రూం క్లీనర్ల వరకు ఇలా ప్రతి వస్తువులు విక్రయిస్తోంది. ఓకే రూఫ్ కింద రకరకాల (…)
DMart Pharmacy: ఇప్పటికే ఇండియన్ రిటైల్ బిజినెస్ dmart మార్చేసింది. టైర్ 1, 2 మాత్రమే కాకుండా.. టైర్ 3 సిటీస్‌లో కూడా అవుట్లైట్లను ఏర్పాటు చేస్తోంది. చేయడం మాత్రమే కాదు.. అద్భుతమైన డిస్కౌంట్లు ఇస్తూ బిజినెస్ తనవైపు తిప్పుకుంటున్నది. పప్పుల దగ్గర నుంచి మొదలుపెడితే దుస్తుల వరకు.. వంట పాత్రల నుంచి మొదలు పెడితే బాత్రూం క్లీనర్ల వరకు ఇలా ప్రతి వస్తువులు విక్రయిస్తోంది.
ఓకే రూఫ్ కింద వివిధ వ్యాపారాలను కొనుగోలు చేయడం ఆకట్టుకుంటున్నది. ఒక నివేదిక ప్రకారం డి మార్ట్ సంస్థ ప్రతిరోజు వందల కోట్ల వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. డి మార్ట్ ఇప్పటివరకు పచారీ సమాను.. ఇతర వస్తువుల వరకే పరిమితమైంది. అయితే ఇప్పుడు మరో అడుగు కూడా ఘనంగా వేయడానికి సిద్ధమైంది. డి మార్ట్ ఇకపై ఫార్మసీ రంగంలోకి కూడా అడుగుపెట్టబోతోంది. ఈ రంగం మీద డిమార్ట్ ఫోకస్ చేసింది. డి మార్ట్ తన మాతృ సంస్థ అవెన్యూ సూపర్ మార్కెట్ రిటైల్ ద్వారా ఫార్మసీ వ్యాపారాన్ని ప్రారంభించింది. ఇప్పటికే ముంబైలో డీమార్ట్ సంస్థ డిమార్ట్ ఫార్మసీ పేరుతో మందుల విక్రయాలను ప్రారంభించింది .
ఇప్పటివరకు రిటైల్ ఫార్మసీ రంగంలోకి అపోలో.. మెడ్ ప్లస్.. హెటిరో వంటి సంస్థలు వచ్చాయి. ఇవి రిటైల్ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. అయినా ఈ విషయంలో ఇప్పటికి వ్యాపారం చేయడానికి అవకాశం ఉంది. అందువల్లే డీట్ ఈ రంగంలోకి వచ్చినట్టుమార్చు. అయితే డి మార్ట్ రాక వల్ల ఎంఆర్పీ కి మందులు విక్రయించే రిటైల్ మెడికల్ షాపులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. డి మార్ట్ ముంబైలో ఇప్పటికే స్టోర్‌లో మందుల మీద 20% డిస్కౌంట్ ఉంది. వ్యాపారాన్ని చేరవేసే డిస్కౌంట్ ను ప్రధాన ఆయుధంగా వాడుకుంటుంది డీమార్ట్. ఇప్పుడు ఫార్మసీరంగంలో కూడా అదే సూత్రాన్ని అమలు చేస్తోంది.
డీమార్ట్ జనరిక్ మందులు కాకుండా.. బ్రాండెడ్ మందులు మాత్రమే విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్టు. అందువల్లే భారీగా ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో డీమార్ట్ ఫార్మసీకి సంబంధించిన వీడియోలు కనిపిస్తున్నాయి. కంపెనీ రిటైల్ మెడికల్ షాపుల నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి మహా నగరాలలో మాత్రమే డీమార్ట్ ఈ కార్యకలాపాలు సాగించే అవకాశం ఉందని తెలుస్తోంది. భవిష్యత్తు కాలంలో ఇతర ప్రాంతాలకు విస్తరిస్తుందని సమాచారం. ఇప్పటికే రిటైల్ వ్యాపారంలో సరికొత్త బెంచ్ మార్క్ సృష్టించిన డీమార్ట్.. ఫార్మసీ వ్యాపారంలో ఎటువంటి సంచనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.

