అజయ్ భూపతి: రీసెంట్ గానే ‘లెనిన్’ మూవీ సక్సెస్ మీట్లో అక్కినేని నాగార్జున సినిమాలు ఎందుకు ఆలస్యంగా తీస్తున్నారు అనే అంశం పై పలు ప్రశ్నలు సంధించిన సంగతి తెలిసిందే. తన లెనిన్ టీం తో పాటు , ఇండస్ట్రీ లో ఆలస్యం గా సినిమాలను అందించే ప్రతీ టెక్నీషియన్ ని ఆలోచింపజేసేలా ఆయన ప్రసంగం ఉండేది. గతం లో మేము ఒక సినిమా విడుదల తేదీని , నెల రోజుల ముందే (…)
అజయ్ భూపతి: రీసెంట్ గానే ‘లెనిన్’ మూవీ సక్సెస్ మీట్లో అక్కినేని నాగార్జున సినిమాలు ఎందుకు ఆలస్యంగా తీస్తున్నారు అనే అంశం పై పలు ప్రశ్నలు సంధించిన సంగతి తెలిసిందే. తన లెనిన్ టీం తో పాటు , ఇండస్ట్రీ లో ఆలస్యం గా సినిమాలను అందించే ప్రతీ టెక్నీషియన్ ని ఆలోచింపజేసేలా ఆయన ప్రసంగం ఉండేది. గతం లో మేము ఒక సినిమా విడుదల తేదీని , నెల రోజుల ముందే ఫైనల్ కాపీ ని చూసేవాళ్ళం. కానీ విడుదల తేదీని ఒకసారి ప్రకటించిన తర్వాత నాలుగైదు సార్లు మార్చాల్సి వస్తుంది. హాలీవుడ్ లో ‘ది ఒడిస్సీ’ సినిమా విడుదలైన సంవత్సరం ముందే తెలిసింది. చెప్పిన తేదికి ఆ సినిమాని మన ముందుకు తీసుకొచ్చారు. కానీ మనం ఎందుకు అలా చేయలేకపోతున్నాం?, ఎక్కడ తప్పు జరుగుతోంది అంటూ ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై ప్రముఖ దర్శకుడు అజయ్ భూపతి స్పందించారు. ఆయన మాట్లాడుతూ ‘హాలీవుడ్ సినిమా షూటింగ్ మన తెలుగు సినీ పరిశ్రమతో సరికాదు. అక్కడ ముందుగా షూటింగ్ ని పూర్తి చేస్తారు , ఆ తర్వాత విడుదల తేదీని చాలా ముందుగానే ప్రకటించారు. కానీ వాళ్ళతో మన దగ్గర నిర్మాతల దగ్గర అంత డబ్బులు ఉండవు. వాళ్ళ ఆర్ధిక పరిస్థితి కి సాధ్యం కాదు. ఇప్పుడు మన ఆడియన్స్ క్వాలిటీ ని గమనించి సినిమాలకు కదులుతున్నారు. అందుకే పోస్ట్ ప్రొడక్షన్ కోసం అత్యధిక సమయాన్ని కేటాయించాల్సి వస్తోంది. ఫస్ట్ కాపీ సిద్దమైన మూడు నెలలకు విడుదల తేదీని ప్రకటించాలి. అప్పుడు ప్రొమోషన్స్ కి కూడా కావాల్సినంత సమయం దొరికింది’ అంటూ అజయ్ భూపతి చెప్పుకొచ్చారు.
ఈయన చెప్పిన దాంట్లో కూడా ఎంతో కొంత లాజిక్ ఉంది కానీ , హాలీవుడ్ లో క్వాలిటీ సినిమాలను కూడా విడుదల చేస్తున్నారు కదా, మన టాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు హాలీవుడ్ కి ఏ మాత్రం తక్కువ కాదు, త్వరలో వాళ్ళతో పోటీ పడే సినిమాలు మన ఇండస్ట్రీ నుండి రాబోతున్నాయి. అలాంటప్పుడు విడుదల తేదీలను కూడా చెప్పిన తేదీకి తీసుకొని వచ్చే విషయంపై కసరత్తు చేస్తే ఇది అసాధ్యమైన విషయం కాదంటూ సోషల్ మీడియా లో నెటిజన్లు అంటున్నారు . లేకపోతే అజయ్ భూపతి దర్శకత్వం వహించిన లేటెస్ట్ ‘శ్రీనివాస మంగపురం’ ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్లో విడుదల కాబోతుంది. మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ ఈ చిత్రం ద్వారా హీరో గా వెండితెర కి పరిచయం కాబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి ఆడియన్స్ నుండి మంచి స్పందన వచ్చింది. మరి సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

