టాటా పంచ్ EV: భారతదేశంలోని కార్ల కంపెనీల్లో టాటా కంపెనీకి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఈ కంపెనీకి చెందిన కార్ల భద్రత విషయంలో ప్రత్యేక దృష్టి పెడుతుందన్న భావన ఉంది. సేప్టీ కార్లు కొనేవారికి ఈ కంపెనీ ది బెస్ట్ గా అనిపిస్తుంది. అనుకున్నట్లుగానే టాటా కంపెనీ మరోసారి సెప్టెంబరులో తనదైన ప్రతాపాన్ని చూపింది. దీని నుంచి మార్కెట్లోకి వస్తున్న కొత్త కారు టాటా పంచ్ ఈవీని భారత్ ఎన్‌సిఎపిలో క్రాష్ టెస్ట్ నిర్వహించింది. ఈ (…)
టాటా పంచ్ EV: భారతదేశంలోని కార్ల కంపెనీల్లో టాటా కంపెనీకి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఈ కంపెనీకి చెందిన కార్ల భద్రత విషయంలో ప్రత్యేక దృష్టి పెడుతుందన్న భావన ఉంది. సేప్టీ కార్లు కొనేవారికి ఈ కంపెనీ ది బెస్ట్ గా అనిపిస్తుంది. అనుకున్నట్లుగానే టాటా కంపెనీ మరోసారి సెప్టెంబరులో తనదైన ప్రతాపాన్ని చూపింది. దీని నుంచి మార్కెట్లోకి వస్తున్న కొత్త కారు టాటా పంచ్ ఈవీని భారత్ ఎన్‌సిఎపిలో క్రాష్ టెస్ట్ నిర్వహించింది. ఈ వాహనంలో ఈ కారు రేటింగ్ ఎంత పొందిందో తెలిస్తే షాక్ అవుతారు. మరి ఆ వివరాల్లోకి వెళదామా..
ఎలక్ట్రిక్ వేరియంట్ లో వచ్చే కొన్ని కార్లు సేప్టీ ఉంటాయా? అనే ఆందోళన చాలా మందిలో ఉంది. కానీ టాటా మోటార్స్ నుంచి వచ్చే పంచ్ ఈవీ మాత్రం అలా కాదని నిరూపించింది. ఈ కారుకు నిర్వహించిన టెస్ట్ లో పెద్దల రక్షణ విషయంలో అద్భుతమైన మార్కులను కలిగి ఉంది. మొత్తం 32 పాయింట్లకు గాను 31.09 పాయింట్లు సాధించి ప్రయాణికులకు ఇచ్చే ఉత్తమ భద్రత ఇచ్చే కారుగా అందించబడింది. ఎటువంటి ప్రమాదాల్లోనైనా ఈ కారు బాడీ నిర్మాణ నిర్మాణం అత్యంత స్థిరంగా ఉంది.
చిన్న పిల్లల భద్రత విషయంలోనూ పంచ్ ఏమాత్రం తగ్గలేదు. ఇందులో మొత్తం 49 పాయింట్లకు 45 పాయింట్లు దక్కాయి. వెనుక సీట్లలో ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్లు సరిగ్గా అమర్చడం, ఇంపాక్ట్ సమయంలో చై డమ్మీలపై తక్కువ ఒత్తిడి పడడంతో ఈ రక్షణ లభిస్తుంది. అయితే ఈ 5 స్టార్ రేటింగ్ కేవలం టాప్ మోడల్‌కే కాకుండా, పంచ్ ఈవీలో లభించే అన్ని వేరియంట్లకు వర్తిస్తుంది. కొనుగోలుదారులు ఏ వేరియంట్ ఎంపికా సేఫ్టీ విషయంలో ఎలాంటి రాజీ పడాల్సిన అవసరం లేదని బీఎన్సిఎపి స్పష్టం చేసింది.
అలాగే ఇందులో సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. 6 ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఆల్ వీల్ డిస్క్ బ్రేకులు, ఏబీఎస్ విత్ ఈబీడీ ప్రొటెక్షన్ ఇచ్చే అవకాశం ఉంది. act.ev ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించిన ఈ కారు బ్యాటరీ అడుగుభాగంలో, ప్రమాదం జరిగినప్పుడు విద్యుత్ ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం కలిగించకుండా నిర్మాణాన్ని డిజైన్ చేశారు.

