ఆంధ్రప్రదేశ్:తల్లికి వందనం పథకం కింద జమ అయిన నగదు డ్రాకు అనుమతించలేదన్న మనస్తాపంతో ఓ బ్యాంకు ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కుందుర్పిలో చోటు చేసుకుంది.స్థానికుల కథనం ప్రకారం,కుందుర్పికి చెందిన నాగేంద్ర,చంద్రకళ దంపతులు తల్లికి వందనం పథకం కింద జమ అయిన డబ్బును తీసుకోవాల్సి ఉంది. కెనరా బ్యాంకుకు(కెనరా బ్యాంక్ ) వెళ్లారు.
అయితే చంద్రకళ మా పేరుతో ఉన్న పంట రుణం క్రాప్ లోన్) బకాయి కారణంగా నగదు డ్రా కోసం బ్యాంకు సిబ్బంది నిరాకరించారు.దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సమాచారం నాగేంద్ర,చంద్రకళ ( నాగేంద్ర, చంద్రకళ )బ్యాంకు ఎదుటే తమపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు.
అక్కడే ఉన్న స్థానికులు వెంటనే అప్రమత్తమై వారిని అడ్డుకుని ప్రాణాపాయం నుంచి కాపాడారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దంపతులను అదుపులోకి తీసుకుని వివరాలు సేకరిస్తున్నారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

