- సీఎం విజయ్‌తో కమల్‌హాసన్ భేటీ
- ప్రత్యేక బహుమతి అందజేత
- దయ, ప్రేమ హృదయాన్ని హత్తుకునేలా ఉందని వ్యాఖ్య
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ను సీనియర్ నటుడు, రాజ్యసభ ఎంపీ కమల్‌హాసన్ కలిశారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఎక్స్‌లో పంచుకున్నారు. ”నేను ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రి, సోదరుడు విజయ్ను వ్యక్తిగతంగా కలిసి నా శుభాకాంక్షలు తెలియజేశాను.” అని రాసుకొచ్చారు. ఈ సందర్భంగా జ్ఞాపకంగా కొన్ని పుస్తకాలు.

”తమిళనాడు అభివృద్ధికి సంబంధించిన అనేక కలలను ఉత్సాహంగా పంచుకున్నారు. సమావేశంలో విజయ్ చూపించిన దయ, ప్రేమ హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయి. పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమిళ చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం అందించే మద్దతు, ఆదరణపై 6 ముఖ్యమైన అభ్యర్థనలు చేశాను. దీని ఫలాలు మరింత వర్ధిల్లాలి.” అని రాసుకొచ్చారు.
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌ని టీవీకే ఘన విజయం సాధించింది. 108 స్థానాలు గెలుచుకుని అతి పెద్ద పార్టీగా అవతరించింది. దీంతో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ఫ్లోర్ టెస్ట్‌లో 144 ఎమ్మెల్యేల మద్దతు లభించింది. ఇక సీఎంగా బాధ్యతలు చేపట్టాక నేరుగా మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ కలిశారు.
మాంపుమికు తమిళనాడు ముఖ్యమంత్రి, తమ్ముడు విజయ్ @TVKVijayHQ వారిని ఈ రోజు కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేసారు.
తమిళనాట మెరుగుదల అనేక స్వప్నాలను ఉత్సాహంగా పంచుకున్నారు. కలుసుకున్నప్పుడు అతను చూపిన లక్షణం ప్రేమను మెప్పించింది.
వివిధ మధ్యయూరులను… pic.twitter.com/timwTZeEdY
— కమల్ హాసన్ (@ikamalhaasan) మే 16, 2026

