హైదరాబాద్ : తాను ఏది చెప్పానో దానిని చేసి చూపించాన ని, భవిష్యత్తులో కూడా తానే తెలంగాణకు సీఎంగా ఉంటానని ప్రకటించారు. రేవంత్ రెడ్డి. హైదరాబాద్లో జరిగిన కాన్ క్లేవ్లో ఆయన మాట్లాడారు. పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తాను ప్రతీకార చార్యలకు తీసుకోనని ఆ లక్షణం తనకు లేదన్నారు సీఎం. అలా అనుకుని ఉంటే ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులను జైల్లో వేసేవాడినని అన్నారు. ఇక అమ్మాయి విషయం చాలా సున్నితమైనదని, దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ తన కుమారుడిని స్టేషన్ కు తీసుకు వచ్చి అప్పగించాలని, అది తనకు మంచిదని హితవు చెప్పారు. దీని వల్ల సమస్య పెరగదన్నారు. పరిష్కారం దొరుకుతుందన్నారు సీఎం.
ఇదే సమయంలో తాను జెడ్పీటీసీగా ఉన్నప్పుడే సీఎం అవుతానని చెప్పానని, చేసి చూపించానని అన్నారు రేవంత్ రెడ్డి. ఇక 2034 వరకు రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటానని తేల్చి చెప్పారు. ఆ తర్వాత వేరే వాళ్లకి అవకాశం ఇచ్చి.. జాతీయకి వెళ్తానని తేల్చి చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయటం తన లక్ష్యమని ప్రకటించారు సీఎం. ఇక మరో పదేళ్ల పాటు తానే సుప్రీం అని ప్రకటించారు. తనను ఎవరూ దించలేరని తెలియజేశారు. ప్రజలు తనను ఆశీర్వ దించని చెప్పారు. ఇక తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత.. రాహుల్ గాంధీ తర్వాత స్థానంలో తాను ఉంటానని చెప్పారు. అయితే తనకు ప్రధానమంత్రి కావాలనే కోరిక లేదు.

