తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తో తనను పోల్చడంపై పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. సైనస్ ల వల్ల తాను ఇబ్బందులు పడ్డానని పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలో జనసేన ఆత్మీయ సమావేశం జరిగింది. స్పోర్ట్స్ ట్రైనింగ్ వల్ల తట్టుకోగలిగానని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. భుజానికి కొంత గాయమయిందని చెప్పారు. 150 మందితో మొదలయిన జనసేన 21 లక్షల మందికి చేరుకుందని అన్నారు. ప్రస్తుతానికి అంతా బాగుందని పవన్ అన్నారు. జనసేన నేతలు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా నుంచి వచ్చారని చెప్పారు. మహారాష్ట్ర నుంచి పదివేల మంది కార్యకర్తలు వచ్చారని పవన్ కల్యాణ్ అన్నారు. చాలా మంది నాయకులు వెళ్లిపోయినా జనసైనికులు తనకు అండగా నిలిచారని చెప్పారు.
ఈ విజయం ఒక్కరోజులో రాలేదని, దశాబ్దాల కాలం పాటు నలిగిపోయామని అన్నారు. రౌడీలను తట్టుకుని నిలబడగలిగానని పవన్ కల్యాణ్ చెప్పారు. తమిళనాడులో విజయ్ పార్టీ పెట్టి గెలిస్తే తనను కూడా ఆ పని చేయాల్సిందే అన్నారు. కానీ ఊళ్లో పెళ్లికి ఎవరో హడావిడి చేసిందన్నట్లు సామెతలాగా వారు సలహా ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరని పవన్ కల్యాణ్ అన్నారు. దయచేసి ఆ పార్టీతో జనసేనను పోల్చవద్దని పవన్ కల్యాణ్ అన్నారు. మీ నుంచే బలమైన నేతలు రావాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. జనసేన వామపక్ష భావజాలం కాదని, అలాగే 2019 లో సింగిల్ గా పోటీ చేస్తే రెండు చోట్ల ఓడించారని అన్నారు. అందుకే 2024 ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి పోటీ చేయాల్సి వచ్చిందని పవన్ కల్యాణ్ అన్నారు.

