ఆంధ్రప్రదేశ్:ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో( తిరుమల ) నేడు రద్దీ కొనసాగుతుంది.ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు, శిలాతోరణం వరకు లైన్లో భక్తులు వేచి ఉన్నారు.
ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు 24 గంటల సమయం పడుతుంది.రూ.300 శీఘ్రదర్శనంకు 4 నుండి 5 గంటల సమయం పడుతుంది.సర్వ దర్శనం టోకెన్ పొందిన భక్తులకు 6 నుండి 8 గంటల సమయం పడుతుంది.
నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 67,722 కాగా, 36,705 మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించారు.నిన్న స్వామి వారి హుండీ ఆదాయం రూ.3.45 కోట్లు.

