నేడు జనసేన ఆత్మీయ సమావేశం జరగనుంది. జనసేన ఉద్యమం నమోదు ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. ఈ అవకాశం పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ప్రభుత్వపరంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లి నమోదులో క్రియాశీలకంగా వ్యవహరించిన సాధకులతో ఈరోజు సాయంత్రం ఆత్మీయ సమావేశం జరగనుంది.
దిశానిర్దేశం…
మంగళగిరిలో నిర్వహించే ఈ సమావేశంలో సాధకాలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. 300పైబడి సభ్యత్వాలు నమోదు చేసిన సాధకాలను గుర్తించి ఈ సమావేశానికి ఆహ్వానించారు. మంత్రులు, ఎమ్మెల్సీ సభ్యత్వ నమోదుకు పార్లమెంట్ ఇంచార్జులుగా వ్యవహరించిన నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు ఈ సమావేశంలో పాల్గొంటారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు పార్టీని క్షేత్రస్థాయిబలోపేతం చేయడంపై పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు.

