- వైమానిక ప్రదర్శనలో ఘోర ప్రమాదం
- ఢీకొన్న రెండు ఎఫ్-18 యుద్ధ విమానాలు
- రెండు అమెరికన్ EA-18G గ్రోలర్ యుద్ధ విమానాలు గాలిలో ఢీకొన్నాయి
అమెరికాలోని మౌంటెన్ హోమ్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో జరిగిన వైమానిక ప్రదర్శనలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు అమెరికన్ EA-18G గ్రోలర్ యుద్ధ విమానాలు గాలిలో ఢీకొన్నాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే మంటలు చెలరేగి కుప్పకూలిపోయాయి. స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఈ ఘటన మధ్యాహ్నం 12:30 గంటల (స్థానిక కాలమానం ప్రకారం) ప్రాంతంలో జరిగింది.
దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. ఈ ప్రమాదంలో యుద్ధ విమానాలు ఢీకొన్న వెంటనే అప్రమత్తమైన పైలట్స్ పారాచూట్స్ సాయంతో కిందకు దూకారు. ఇడాహో స్టేట్స్‌మ్యాన్ కథనం ప్రకారం, నలుగురు సిబ్బంది (పైలట్లు సురక్షితంగా) బయటకు దూకాని, వారు పూర్తిగా క్షేమంగా ఉన్నారని ఆ షో అనౌన్సర్ ప్రేక్షకులకు తెలియజేశారు.
నివేదికల ప్రకారం, ఈ ప్రమాదంలో చిక్కుకున్న విమానాలు యూఎస్ నెవీ/ఎయిర్ ఫోర్స్ ఉపయోగించే రెండు EA-18G గ్రోలర్ ఫైటర్ జెట్లు. ఇవి F-18 హార్నెట్‌కు చెందిన ఒక అధునాతన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వేరియంట్. ఎయిర్‌బేస్‌కు సుమారు రెండు మైళ్ల దూరంలో ఈ రెండు జెట్లు కూలిపోయాయని అధికారులు తెలిపారు. మౌంటెన్ హోమ్ ఎయిర్ ఫోర్స్ బేస్ ప్రతినిధి మాట్లాడుతూ, దర్యాప్తు బృందాలు సంఘటన వెలుగు చూస్తున్నాయని, ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతోందని తెలిపారు.
బ్రేకింగ్: ఇడాహోలోని మౌంటెన్ హోమ్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో గన్‌ఫైటర్ స్కైస్ ఎయిర్ షో సందర్భంగా 2 US నేవీ సూపర్ హార్నెట్స్/గ్రోలర్లు క్రాష్ మరియు ఢీకొన్నాయి.
విమాన సిబ్బంది ఇద్దరూ సురక్షితంగా బయటపడ్డారని విమానయాన వర్గాలు KTVBకి తెలిపాయి. pic.twitter.com/GPsdrwTFWq
— ఓపెన్ సోర్స్ ఇంటెల్ (@Osint613) మే 17, 2026

