– ప్రకటన –
నవతెలంగాణ – హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామ శివారులోని వ్యాస ఫామ్ హౌస్లో జరిగిన బర్తడే పార్టీలో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ మజీద్బండకు చెందిన యాక్సిస్ బ్యాంక్ సెక్యూరిటీ గార్డ్ సాయి(28) ఫామ్ హౌస్లో స్విమ్మింగ్ పూల్లో పడి మృతి చెందాడు. ఉదయం వాచ్మన్ గమనించి స్నేహితులకు సమాచారం ఇవ్వగా వారు సాయిని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఏడాది వయసున్న కుమారుడు ఉన్నారు. అయితే తమ కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నాయని తల్లిదండ్రులు గుర్తించారు.
– ప్రకటన –

