యుద్ధం 2 TRP రేటింగ్లు: గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదల ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచిన చిత్రాలలో ‘వార్ 2’. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ని ప్రముఖ నిర్మాత నాగవంశీ 90 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశాడు. కానీ ఫ్లాప్ టాక్ రావడంతో ఫుల్ రన్ లో ఈ చిత్రం కనీసం 40 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు కూడా తెలుగు వెర్షన్ నుండి రాలేదు. ఓవరాల్ గా హిందీలో హృతిక్ రోషన్ క్రేజ్ కారణంగా కాస్త యావరేజ్ రేంజ్ లో ఆడ, కల్లెక్షన్స్ పరంగా స్పై యూనివర్స్ చిత్రాల్లోనే తక్కువ రాబట్టిన సినిమాగా నిలిచింది ఈ చిత్రం. అయితే ఈ సినిమాని గత వారం స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ చేశారు.
థియేటర్స్ లో ఎలాగో మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకోలేకపోయిన ఈ చిత్రం, కనీసం టీవీ టెలికాస్ట్ లో అయినా మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందేమో అని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే ఘోరమైన డిజాస్టర్ రేటింగ్స్ ని నమోదు చేసుకుంది. BAARC విడుదల చేసిన ప్రకారం. ఇప్పటి వరకు ఒక స్టార్ హీరో సినిమాకు ఈ స్థాయి తక్కువ రేటింగ్స్ నమోదు కాలేదు , ఇది ఎన్టీఆర్ స్టార్ స్టేటస్ కి చాలా అవమానకరమైన రేటింగ్స్ అంటున్నారు విశ్లేషకులు. స్టార్ హీరోల సినిమాలకు కనీసం 5 కి పైగా టీఆర్ఫీ రేటింగ్స్ రావడం సర్వసాధారణం. 3 నుండి 4 టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చినా డిజాస్టర్ అని పిలు ట్రేడ్ , అలాంటిది కేవలం 2.37 రేటింగ్స్ అంటే ఏ రేంజ్ డిజాస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు.
ఎన్టీఆర్ ని విలన్ క్యారెక్టర్ లో చూసేందుకు అటు థియేట్రికల్ ఆడియన్స్, ఇటు టీవీ ఆడియన్స్ ఇద్దరూ కూడా ఎలాంటి ఆసక్తి చూపించలేదని ఈ రెస్పాన్స్ ని చూసి అర్థం చేసుకోవచ్చు. లేకపోతే ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో కలిసి ‘డ్రాగన్’ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ వీడియో ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 20న విడుదల చేయబోతున్నాడు. ఈ గ్లింప్స్ నిడివి దాదాపుగా 4 నిమిషాల 35 సెకండ్ల వరకు ఉంటుందని టాక్.

