ఇరాన్ చమురు ఆంక్షలు ఎత్తివేయబడ్డాయి: ఇది శుభవార్త. ముమ్మాటికీ ప్రపంచానికి ఉపశమనం కలిగించే వార్త. ధరల సెగతో అల్లాడుతున్న సగటు జీవికి జీవితం పోసిన వార్త. ఇలా జరుగుతుందని.. ఇలా ఒక్కసారిగా మారిపోతుందని ఎవరూ ఊహించలేదు. మొత్తానికి ఈ పరిణామంతో ప్రపంచంలో మెజారిటీ ప్రజలు ఉపశమనం పొందుతున్నారు.
ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధం వల్ల ముడి చమరు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. డాలర్ విలువ కూడా పెరుగుతున్న అంతర్జాతీయంగా అన్ని దేశాల కరెన్సీల మీద తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. విదేశీ మారక ద్రవ్యాలు వేగంగా కరిగిపోతున్నాయి. దీనివల్ల అన్ని దేశాలు వీపరితమైన ఇబ్బంది పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని దేశాలు ఆర్థికంగా పొదుపు పాటిస్తున్నాయి. అంతేకాదు చమురు ధరలు కూడా పెంచుతున్నాయి. దీంతో సగటు జీవి బడ్జెట్ లెక్కలు పూర్తిగా మారిపోతున్నాయి.
ఇలాంటి విపత్కర పరిస్థితిలో ప్రపంచమున ఒక్కసారిగా ఇరాన్ గుడ్ న్యూస్ చెప్పింది. శాంతి చర్చల తర్వాత ఇరాన్ ఆయిల్ మీద అమెరికా విధించిన ఆంక్షలు తాత్కాలికంగా ఎత్తివేసినట్లు తెలుస్తోంది. ఈ పరిశీలన ఇరాన్ అధికారిక మీడియా తస్నీం న్యూస్. అయితే ఈ రిలీఫ్ శాశ్వతంగా ఉండాలని.. దీంతోపాటు మిగిలిన అంశాలు కూడా ఎత్తివేయాలని ఇరాన్ మీడియా అభిప్రాయపడింది. ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. అయితే ఈ ఆంక్షలు తాత్కాలికంగా కాకుండా.. శాశ్వతంగా ఉండాలని ప్రపంచ దేశాల అధినేతలు అభిప్రాయపడుతున్నారు. అమెరికా తీసుకున్న నిర్ణయం వల్ల గ్లోబల్ స్టాక్ మార్కెట్లు వేగం పుంజుకున్నాయి. లాభాల బాట పట్టాయి.
ఈ నిర్ణయం అమెరికా ఎప్పుడో తీసుకుంటే చాలా బాగుండేది. యుద్ధం చేసిన అమెరికా సాధించిన లక్ష్యాలు పెద్దగా కనిపించడం లేదు. పైగా అమెరికాకు తత్వం బోధపడింది. ఇప్పటికే ఆ దేశం ఆర్థికంగా ఇబ్బంది పడుతోంది. అందువల్లే ఇరాన్ చమురు మీద కాంక్షలు తొలగించబడ్డాయి. తాత్కాలికంగానైనా అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం.. భవిష్యత్ కాలంలో ప్రపంచ దేశాలకు అనేక రకాల మేలు చేకూరుతుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అమెరికా కు యుద్ధం వల్ల నష్టం ఎదురుకావడంతో ఈ నిర్ణయం తీసుకుని ప్రపంచ ఆర్థిక రంగనిపుణులు చెబుతున్నారు.

