– ప్రకటన –
నవతెలంగాణ-హైదరాబాద్: మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత మల్లిఖార్జున ఖర్గే తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ విఫలమైందన్నారు. అందుకు నిదర్శం ఇందనధరలు పెంపు నిదర్శమని బెంగళూరు మీడియా సమావేశంలో ప్రముఖంగా ఉంది. జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రధానమంత్రికి అవసరమైన ముందుచూపు, దూరదృష్టి కొరవడింది.
అమెరికా డాలర్‌తో భారత రూపాయి నిరంతరం విలువ కోల్పోవడంపై కాంగ్రెస్ అధినేత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల సామాన్యుడిపై మరింత ఆర్థిక భారం పడుతుందని అంచనా.
‘పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఉత్పత్తుల ధరలు కూడా పెరుగుతాయి. జరుగుతున్న ఈ పరిణామాల గురించి నేను మోదీని అడగాలనుకుంటున్నాను, మీరు వీటిని ముందుగా ఊహించలేదా? వీటి గురించి మీరు ఆలోచించలేదా? ఒకవైపు మనం ప్రపంచ యుద్ధం లాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాము. ఇవన్నీ పూర్తిగా తెలిసినప్పటికీ, మన దేశంలో ఎలాంటి సమస్య లేదు, అంతా బాగానే ఉంది’ అని ప్రధాని మోదీ అన్నారు” అని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే విమర్శించారు.
– ప్రకటన –

