తమిళనాడు అసెంబ్లీ చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుని, ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన జోసెఫ్ విజయ్.. అప్పుడే పరిపాలనలో తన మార్క్ చూపించడం. అయితే, ఆయన తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఇటు రాజకీయాల్లో, అటు కోలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా సినిమా రంగానికి సంబంధించిన కీలక శాఖను కేటాయించిన విధానం ఇప్పుడు పెద్ద వివాదానికి తెరలేపింది.
ఫిల్మ్ శాఖపై వివాదం..
తమిళనాడు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఆమోదంతో సీఎం విజయ్ తన మంత్రివర్గ సహచరులకు శాఖలను కేటాయించారు. ఇందులో భాగంగా ఎగ్మోర్ ఎమ్మెల్యే, పార్టీ ప్రచార కార్యదర్శి రాజ్‌మోహన్‌కు స్కూల్ ఎడ్యుకేషన్, తమిళ అభివృద్ధి శాఖలతో పాటు అత్యంత కీలకమైన ఫిల్మ్ అండ్ సినిమాటోగ్రాఫ్ యాక్ట్ బాధ్యతలను అప్పగించారు. విజయ్ 30 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలోనే, ఈ హోమ్ టర్ఫ్‌ను వేరే వ్యక్తికి ఇవ్వడం, అది కూడా పరిశ్రమతో పెద్దగా సంబంధం లేని వ్యక్తికి కేటాయించడంపై కోలీవుడ్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
విశాల్అసంతృప్తి !
రాజ్‌మోహన్‌కు ఫిల్మ్ టెక్నాలజీ అండ్ సినిమాటోగ్రాఫ్ యాక్ట్ శాఖ బాధ్యతలు అప్పగించడంపై నటుడు విశాల్ తన అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం విజయ్ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. ముఖ్యమంత్రి విజయ్ మంత్రులకు శాఖలు కేటాయించడం సంతోషమే. కానీ, సినిమా రంగానికి సంబంధించిన బాధ్యతలను రాజ్ మోహన్ కి ఇవ్వడం కాస్త నిరాశ కలిగిస్తోందని చెప్పారు..
ప్రస్తుతం తమిళ సినిమా పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉంది. ఎన్నో సంస్కరణలు రావాల్సి ఉంది. అలాంటిది ఇండస్ట్రీతో ఎలాంటి అనుభవం లేని వ్యక్తికి మా సమస్యలను ఎలా చెప్పుకోవాలి? 30 ఏళ్లుగా ఇండస్ట్రీలోనే ఉన్న సీఎం విజయ్ గారే ఈ శాఖను దగ్గరుండి చూసుకుంటే మాకు ఓ నమ్మకం ఉంది అంటూ విశాల్ తన ఆవేదన వ్యక్తం చేశారు.
చూడడానికి సంతోషం #CMJosephVijay ఎన్నికైన ఎమ్మెల్యేలకు మంత్రిత్వ శాఖలు కేటాయించడం, గౌరవప్రదమైన మంత్రిని చూడటం చాలా నిరుత్సాహంగా ఉంది #రాజ్‌మోహన్ ఫిల్మ్ టెక్నాలజీ మరియు సినిమాటోగ్రాఫ్ చట్టం మంత్రిగా బాధ్యతలు చేపట్టాలి. నేను లేదా మనం ఒక శరీరంగా లేదా సంఘంగా మన అభ్యర్థనలను ఎలా అందిస్తాము లేదా…
— విశాల్ (@VishalKOfficial) మే 17, 2026
విజయ్ కి మద్దతుగా లారెన్స్..
విశాల్ వ్యాఖ్యలు కోలీవుడ్‌లో కలకలం రేపగా.. మరో స్టార్ రాఘవ లారెన్స్ మాత్రం సీఎం విజయ్‌కు మద్దతుగా నిలిచారు. విజయ్ ఏ నిర్ణయమైనా చాలా ఆలోచించే తీసుకుంటారని చెప్పుకొచ్చారు. మన గౌరవ ముఖ్యమంత్రి, ఈ నిర్ణయాన్ని తొందరపాటుతో తీసుకోలేదు. ఇండస్ట్రీలో ఉన్న సమస్యలు నాకు తెలుసు. కానీ, కొత్తగా బాధ్యతలు చేపట్టిన మంత్రి రాజ్ మోహన్ కి కొంత సమయం ఇవ్వాలి. ఆయన పరిశ్రమ సంక్షేమం కోసం ఖచ్చితంగా మంచి చేస్తారనే నమ్మకం నాకుంది అంటూ లారెన్స్ ట్వీట్ చేశారు.
మా గౌరవనీయ ముఖ్యమంత్రి మరియు నాన్బా #CMJosephVijay జాగ్రత్తగా ఆలోచించకుండా మరియు పరిశీలన లేకుండా ఖచ్చితంగా ఈ నిర్ణయం తీసుకోలేదు. ఉద్వేగభరితంగా ప్రతిస్పందించే బదులు, దానికి కొంత సమయం ఇచ్చి మన మద్దతును అందజేద్దాం. మంత్రి రాజ్ మోహన్ తన సత్తా చాటుతారని ఆశిస్తున్నాను… pic.twitter.com/oA1o9vKD7T
— రాఘవ లారెన్స్ (@offl_Lawrence) మే 17, 2026

