ముంబై ఇండియన్స్: ఎలాగూ ప్లే ఆఫ్ అవకాశం లేదు. గెలిస్తే బోనస్. ఓడిపోతే మైన్స్. విజయమో వీర స్వర్గమో.. ఇదిగో ఇలా సాగిపోతోంది ఆ జట్ల ఆట తీరు. అందుకే ఐపీఎల్ లో జరిగిన మ్యాచ్ లు చూస్తే వాళ్లకు విపరీతమైన ఆనందాన్ని పంచుతోంది. దీంతో ఐపీఎల్ చివరి మ్యాచులు ఊహకు అందకుండా సాగుతున్నాయి.
ఐపీఎల్ లో గ్రూప్ సమరం దాదాపుగా ముగిసినట్టే. బెంగళూరు, హైదరాబాద్, గుజరాత్ ప్లే ఆఫ్ వెళ్లిపోయాయి. మరో స్థానం కోసం విపరీతమైన పోటీ ఉంది. ఆ పోటీలో గెలవాలని చాలా జట్లు ఆరాటపడుతున్నాయి. టాప్ 2 స్థానంలో నిలిచే జట్టు గురించి కూడా విపరీతమైన ఉత్కంఠ ఏర్పడింది..
ఇప్పటికే ప్లే ఆఫ్ నుంచి తప్పుకున్న జట్లు.. తదుపరి ముందడుగు వేసే అవకాశం దాదాపుగా కష్టం. అయితే ఈ జట్లు తమకంటే పై స్థానంలో ఉన్న జట్లతో ఒక ఆట ఆడుకుంటున్నాయి. అందువల్లే మ్యాచ్ ల స్వరూపం పూర్తిగా మారిపోతుంది. ఈ సీజన్లో ముంబై జట్టు, లక్నో ప్లే ఆఫ్ నుంచి తప్పుకున్నాయి. అయితే ఈ జట్లు ఇటీవల మ్యాచులలో మాత్రం అదరగొట్టాయి. అనితర సాధ్యమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాయి. దీనితో ప్లే ఆఫ్ రేసు లో దూసుకుపోతున్న జట్లకు ముకుతాడు వేశాయి.
ఈ ఐపీఎల్ లో వరుస విజయాలతో దూసుకుపోయిన పంజాబ్ జట్టు.. ముంబై చేతిలో ఓడిపోయింది. ఇప్పుడు బెంగళూరు చేతిలో గెలిచినా సరే పంజాబ్ ప్లే ఆఫ్ వెళుతుందనే నమ్మకం లేదు. లక్నో జట్టు కూడా చెన్నై జట్టును ఓడించింది. ప్లే ఆఫ్ అవకాశాలను క్లిష్టతరం చేసింది. అంతేకాదు హైదరాబాద్ చేతిలో కూడా చెన్నై ఓడిపోయింది. తదుపరి మ్యాచ్లో గెలిచి.. మిగిలిన జట్ల సమీకరణలు కలిసి వస్తేనే చెన్నై ప్లే ఆఫ్ అవుతుంది..
కోల్కతా ఇప్పటికే ప్లే ఆఫ్ అవకాశాలను కోల్పోయింది. అయితే ఆ జట్టు గుజరాత్ మీద విజయం సాధించింది. 248 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ ముందుకు వచ్చింది. హైదరాబాద్ జట్టు చెన్నైని ఓడించడం ద్వారా గుజరాత్ ముందడుగు వేసింది. లేకుంటే ఆ జట్టుకు కూడా ఇబ్బందిగా ఉండేది. ఢిల్లీ క్యాపిటల్స్ సాంకేతికంగా మాత్రమే ప్లే ఆఫ్ రేసులో ఉంది. అయితే ఈ జట్టు రాజస్థాన్ జట్టుకు షాక్ ఇచ్చింది. దీంతో ఆ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలను ప్రారంభించింది.
ముంబై, లక్నో జట్లు తమ తదుపరి మ్యాచ్లలో గౌరవప్రదమైన పోటీని ఇస్తాయి.. విజయాలతో ఈ సీజన్లను ముగించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే విజయాల వల్లే జట్ల బ్రాండ్ విలువ పెరుగుతుంది. కాబట్టి లక్నో, ముంబై నుంచి రాయల్స్ జట్టుకు ఇబ్బంది తప్పదు. సాంకేతికంగా మాత్రమే ప్లే ఆఫ్ జాబితాలో ఉన్న కోల్కతా.. చివరి వరకు పోరాడాలని చూస్తోంది. మరో వైపు పంజాబ్ జట్టు లక్నోను ఎదుర్కోబోతోంది. ఈ విజయం పంజాబ్ జట్టుకు అత్యంత అవసరం. ప్రతి జట్టు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో చివరి మ్యాచ్లు అత్యంత రసవత్తరంగా సాగే అవకాశం.

