Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా పై అక్కినేని ఫ్యాన్స్ ఎన్ని ఆశలు పెట్టుకున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం. టీజర్, ట్రైలర్ వంటి ప్రమోషనల్ కంటెంట్ కూడా, ఈసారి అఖిల్ మినిమం గ్యారంటీ కంటెంట్ తో మన ముందుకు రాబోతున్నట్టు సూచిస్తున్నాయి. తమన్ అందించిన పాటలు కూడా బాగానే క్లిక్ అయ్యాయి. ఇక అఖిల్ తో పాటు , మూవీ టీం మొత్తం ఈ సినిమా ప్రొమోషన్స్ లో ఫుల్ బిజీ గా ఉన్నారు. అఖిల్ , భాగ్యశ్రీ భోర్సే నాన్ స్టాప్ ఒక పక్క ఇంటర్వ్యూ ఇస్తూనే, మరోపక్క ఈవెంట్స్ లో కూడా పాల్గొంటున్నారు. ఇలా సినిమా పై బజ్ పెంచేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం బాధాకరం.
ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని ప్రాంతాలనూ మొదలయ్యాయి. ఆన్లైన్ ట్రాకింగ్ సిస్టం ద్వారా నమోదైన ఈ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ చాలా తక్కువగా ఉంది. హైదరాబాద్ లో కనీసం కోటి రూపాయిల రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగితే , పర్వాలేదు , డీసెంట్ అని అనుకోవచ్చు. కానీ ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా హైదరాబాద్ లాంటి సిటీ నుండి వచ్చిన గ్రాస్ కేవలం 64 లక్షల రూపాయలు మాత్రమే. ఇండియా మొత్తం మీద ఈ చిత్రం ఇప్పటి వరకు 2147 షోస్ ని షెడ్యూల్ చేశారు. ఈ షోస్ ద్వారా ఈ నమోదైన గ్రాస్ వసూళ్లు 2 కోట్ల 13 లక్షల రూపాయిలు మాత్రమే. ఆక్యుపెన్సీ కేవలం 18 శాతం మాత్రమే ఉండగా, 6 హౌస్ ఫుల్స్ షోలు , 103 ఫాస్ట్ ఫిల్లింగ్ షోలు నమోదయ్యాయి.
ప్రమోషనల్ కంటెంట్ ప్రామిసింగ్ గా కనిపించడం, ఇంత తక్కువ గ్రాస్ వసూళ్లు నమోదు అవ్వడానికి ముఖ్య కారణం అఖిల్ గత చిత్రాల ప్రభావమే. ఆయన గత చిత్రం ‘ఏజెంట్’ ఎంతటి ఘోరమైన డిజాస్టర్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతకు ముందు సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు. అందుకే అఖిల్ సినిమా పై ప్రేక్షకుల్లో ఈసారి నమ్మకం పెద్దగా కలగలేదు, ఆ కారణం చేతనే అడ్వాన్స్ బుకింగ్స్ ఇంత తక్కువగా నమోదు అయ్యాయి. ఇక నార్త్ అమెరికా లో అయితే ఈ చిత్రం 82 వేల డాలర్ల గ్రాస్ వసూళ్లు బుకింగ్స్ ద్వారా వచ్చాయి. ఇక్కడ మాత్రం పర్వాలేదు అనే రేంజ్ ట్రెండ్ ఉంది. ఓవరాల్ అడ్వాన్స్ బుకింగ్స్ తక్కువగానే, రేపు పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంటే మాత్రం , ఓనింగ్స్ చాలా సాలిడ్ గా ఉంటాయని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

