లెనిన్: అఖిల్ అక్కినేని కెరీర్లో భారీగా దూసుకెళ్తున్న ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద తన జోరు కొనసాగుతోంది. విడుదలైన తొలి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా రూ.61.1 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఈ హై ఆక్టెన్ యాక్షన్ డ్రామా ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. అఖిల్‌కు ఇది కెరీర్లోనే అత్యంత బలమైన ఓపెనింగ్గా నిలవడంతో పాటు ప్రేక్షకుల నుంచి కూడా విశేష స్పందన వస్తోంది. మురళీషోర్ అబ్బూరు కి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. గత 24 గంటల్లో ఒక్క బుక్‌మైషోలోనే 74 వేలకుపైగా టికెట్లు అమ్ముడవడం సినిమాపై ఉన్న క్రేజ్‌కు నిదర్శనంగా మారింది. థియేటర్లలో మంచి ఆక్యుపెన్సీ కొనసాగుతుండటంతో తొలి వారంలోనే ఈ చిత్రం మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ సినిమా విజయంలో అఖిల్ నటనతో పాటు సంగీత దర్శకుడు తమన్ అందించిన నేపథ్య సంగీతం కీలక పాత్ర పోషించిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో ఆయన ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత ఉత్కంఠను తీసుకొచ్చిందని ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే ఈ సినిమాలో వినిపించకుండా మిగిలిపోయిన ఒక పాటపై అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి ఉంది. ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని సంగీత దర్శకుడు తమన్ కీలక ప్రకటన చేశారు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఆ అన్‌రిలీజ్డ్ సాంగ్ 2026 జూలై 15న విడుదల చేయనున్నారు. ఈ పాటను గుంటూరులో నిర్వహించనున్న ‘లెనిన్ బ్లాక్‌బస్టర్ సక్సెస్ సెలబ్రేషన్స్ వేదికగా తొలిసారిగా విడుదల చేయడాన్ని గ్రాండ్ గా ప్రకటించడంతో అభిమానుల ఉత్సాహం మరింత పెరిగింది.
ఈ వేడుకకు చిత్ర బృందం మొత్తం హాజరుకానుంది. అక్కినేని నాగార్జున, నిర్మాత సూర్యదేవర నాగ వంశీ, ఈశ్వరి రావు, బ్రహ్మాజీతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు ఈ సందర్భంగా భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన ‘లెనిన్’కు ఈ సక్సెస్ సెలబ్రేషన్ మరో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

