అక్కినేని కుటుంబం, అభిమానుల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. ఆ కుటుంబం నుంచి కొత్త తరంలో చాలా పెద్ద స్టార్ అయిపోతాడు అనుకున్న అఖిల్.. పదేళ్లకు పైగా హిట్టు లేక తీవ్రంగా ఇబ్బంది పడి.. ఎట్టకేలకు ‘లెనిన్’ మూవీతో నిఖార్సయిన తొలి హిట్ అందుకుంది. తొలి వీకెండ్లో అంచనాలకు మించి వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. తర్వాత కూడా బలంగా నిలబడుతోంది.
అంతిమంగా ఇది సూపర్ హిట్టా, బ్లాక్ బస్టారా అన్నది తేలుతుంది. ఇప్పటికైతే హిట్ స్టేటస్ అందుకుంది. ఇది అక్కినేని కుటుంబానికే కాక అభిమానులకూ గొప్ప ఉపశమనం అనడంలో సందేహం లేదు. ఒక విజయం సాధించాక వచ్చే ఆత్మవిశ్వాసమే వేరు. ఇక్కడి నుంచి అఖిల్ కెరీర్ మరింత ఊపందుకుంటుందని. నాగ్ దగ్గరుండి జాగ్రత్తగా ‘లెనిన్’ సినిమా తీయించి, పోస్ట్ ప్రొడక్షన్ కూడా జాగ్రత్తగా చూసుకుని కొడుక్కి విజయానందించాడు.
ఇక అఖిల్ తర్వాత సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘లెనిన్’లో అఖిల్ కథలో భాగంగా ఉన్నాడు కానీ.. ఇది అతణ్ణి ఎలివేట్ చేయడానికి రాసిన కథ కాదు. ఇమేజ్ బిల్డప్, ఎలివేషన్ల మీద పెద్దగా ఫోకస్ పెట్టలేదు. క్లైమాక్స్‌లో మినహాయిస్తే పాత్రను అండర్ ప్లే చేశారు. ఐతే ఇప్పుడు హిట్టు పడిన నేపథ్యంలో అఖిల్ మాస్ ఇమేజ్ మీద దృష్టిపెట్టాలని, తనకు సరైన ఎలివేషన్లు ఉండాలని.. అతను ఇంకా పెద్ద హీరో అయ్యేలా పక్కా మాస్ కమర్షియల్ సినిమా చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు.
ఐతే ఈ దిశగా ఆశించడంలో తప్పు లేదు కానీ.. మాస్ మాస్ అంటూ ఓవర్ ద బోర్డ్ మాత్రం వెళ్లాల్సిన అవసరం లేదు. ‘లెనిన్’తో ప్రస్తుతం ఇంకొంచెం ఎలివేషన్లు, మాస్ ఎలిమెంట్స్, యాక్షన్ ఘట్టాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి కానీ.. ఒకేసారి పైకి ఎదగాలని అతణ్ణి మరీ పెద్ద హీరో ప్రొజెక్ట్ చేస్తే మొదటికే మోసం వస్తుంది.
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ లాంటి ఆడాక ‘ఏజెంట్’ సినిమాతో ఇలాగే ట్రై చేశారు. ఫలితం ఏమైందో తెలుసా. అఖిల్ ఇక్కడి నుంచి ఒక్కో మెట్టు ఎక్కే ప్రయత్నం చేయాలి తప్ప ‘ఏజెంట్’ తరహాలో ఒకేసారి పైకి ఎగిరిపోవాలని చూస్తే కథ మళ్లీ మొదటికి వస్తుంది. అంతే కాక గత అనుభవాల దృష్ట్యా పెద్ద దర్శకులతో భారీ చిత్రాలు చేయడం కంటే కమింగ్ డైరెక్టర్లతో జట్టు కట్టి మిడ్ రేంజ్ సినిమాలతో జాగ్రత్తగా కెరీర్‌ను ప్లాన్ చేసుకుంటే మంచిది.

