అక్కినేని అఖిల్ సరికొత్త మాస్ మేకోవర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’. దాదాపు మూడేళ్ళ గ్యాప్ తర్వాత అఖిల్ నుండి సినిమా వచ్చింది. మంచి అంచనాల మధ్య విడుదలైన లెనిన్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఊహించని రేంజ్ ఓపెనింగ్స్‌తో దూసుకెళ్తుంది. ‘అఖిల్ 2.0 ఈజ్ హియర్’ అంటూ ఫ్యాన్స్ థియేటర్ల వద్ద సెలబ్రేషన్స్ చేసుకుంటుండగా సౌండ్ బాక్సాఫీస్ రికార్డుల్లో స్పష్టంగా వినిపిస్తోంది. శుక్రవారం థియేటర్స్‌లోకి వచ్చిన ఈ చిత్రం మొదటి రోజునే సంచలన వసూళ్లను సాధించి అఖిల్ కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్‌ను నమోదు చేసింది.
ప్రపంచవ్యాప్తంగా ‘లెని’ చిత్రం మొదటి రోజునే వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ. 16.7 కోట్ల గ్రాస్ వసూలు చేసి ప్రభంజనం సృష్టించింది. అందుకు సంబంధించి అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. నటన, యాక్షన్ సీక్వెన్స్ మరియు కంటెంట్‌కు ఆడియన్స్ ఫిదా అవ్వడంతో మార్నింగ్ షోస్ నుండే థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడాయి. దాంతో తన కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ అందుకున్నాడు అఖిల్. రోజు రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జోరుచూపించనప్పటికీ మౌత్ టాక్ తో ఈవెనింగ్ షోస్ ఫుల్స్ గా కనిపించాయి. అఖిల్ గత్ సినిమాలతో ప్రస్తుత లెనిన్ చాలా బెటర్ అనే టాక్ రెండవ రోజు అడ్వాన్స్ బుకింగ్స్ లో కనిపించింది. ఈ రోజు మార్నింగ్ షోస్ సాలిడ్ బుకింగ్స్ తో ఓపెన్ అయ్యాయి. పాజిటివ్ మౌత్ టాక్ తో ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద మరిన్ని కొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

