– ప్రకటన –
నవతెలంగాణ-ఆలేరు రూరల్
ఆలేరు మండలం గుండ్లగూడెం గ్రామానికి చెందిన ఎలగందుల పాణి పై ఇంటి పరిసరాల్లో అడవి పంది దాడి చేసింది. ఈ ఘటనలో ఆయన ఎడమ చేతి వేలు పూర్తిగా తెగిపోవడంతో పాటు పొట్ట భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన తీవ్ర పేదరికంలో ఉండటంతో వైద్య చికిత్సకు ఆర్థిక సహాయం అత్యవసరంగా అవసరమైంది. మనం అందించే చిన్న విరాళం కూడా ఒక నిరుపేద ప్రాణాన్ని కాపాడటంలో వారి కుటుంబానికి అండగా నిలుస్తుంది. అందువల్ల మానవత్వంతో స్పందించి, మీకు చేతనైన ఆర్థిక సహాయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సహాయం పంపవలసిన ఫోన్ నంబర్: 9550997890
– ప్రకటన –

