కొరియా వర్కర్స్ పార్టీ కేంద్ర కమిటీ సమావేశంలో కిమ్
యూరప్, పశ్చిమాసియా స్థితిపై ఆందోళన`అమెరికా తీరుపై ఆగ్రహం
ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా అణ్వాయుధ దేశమని అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ పునరుద్ఘాటించారు. క్లిష్టమైన అంతర్జాతీయ భద్రతా పరిస్థితుల్లో అనుకోని విపత్తుల నుంచి రక్షణ కోసం ఇదే మార్గమన్నారు. యూరప్, పశ్చిమాసియా పరిస్థితులపై ఆందళన వ్యక్తం చేశారు. యుద్ధాలు చేస్తూ, రక్తపాతం సృష్టిస్తున్న అమెరికా తీరును ఆక్షేపించారు. ఈ దేశం తీరు గ్యాంగ్స్టర్ వాలే ఉన్నదని దుయ్యబట్టారు. ఈ 20, 21, 22 తేదీల్లో రెండవ అధికార పార్టీ ఆఫ్ కొరియా 9వ కేంద్ర కమిటీ ప్లీనరీ సమావేశం కిమ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పార్టీ తీసుకున్న కీలక నిర్ణయాలతో పాటు విధానాలను కిమ్ సమీక్షించారు. సోషలిస్టు రాజ్య నిర్మాణ సుస్థిరాభివృద్ధి పథంలో ముందుకెళ్లడంపై సూచనలు చేశారు. ఉత్తర కొరియాపై దాడికి అమెరికా, దక్షిణ కొరియా వ్యూహాలు రచిస్తున్నాయని. అణ్వస్త్ర శక్తి పెంచుకోవాలన్న ధేయంతో ముందుకెళుతున్నట్లు చెప్పారు. అణ్వస్త్రాలు కలిగిన రాజ్యంగా తన స్థానానికి ఉత్తర కొరియా కట్టుబడి ఉన్నదన్నారు. ప్రపంచ సైనిక`రాజకీయ పరిస్థితులు ఎంత జఠిలంగా మారినప్పటికీ, బహుళ విధాలా ప్రమాదాలుగానీ నిర్భయంగా ముందుకెళ్లేందుకు అణ్వస్త్రాలు అభివృద్ధి చెందుతాయి. ఉత్తర కొరియా అణ్వాయుధశాలగా మారబోతోందని ఉద్ఘాటించారు. ఆ దిశగా ఎలాంటి కార్యాచరణ అమలు చేస్టోరో మాత్రం చెప్పలేదు కానీ ఇప్పటికే 10వేల టన్నుల స్రాజిక్ గైడెడ్ మిస్సైల్ క్రూయిజర్ నిర్మాణం, సంప్రదాయ ఆయుధాల తయారీకి కిమ్ ఆదేశాలు జారీ చేయబడ్డాయి. కమిటీ సమావేశానికి పార్టీ కేంద్ర నాయకత్వం, సీనియర్ అధికారులు ఉన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా కిమ్ అధ్యక్షత వహించారు.

