దేశ వ్యాప్తంగా ఆదివారం జరిగిన 12వ అంతర్జాతీయ యోగా దినోత్సనం వేడుకలకు ప్రధాని మోదీ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా కోల్కతా ఐకానిక్ రెడ్ రోడ్లో వేలాది మంది పౌరులతో యోగా నిర్వహించారు.
కోల్కతా : దేశ వ్యాప్తంగా ఆదివారం జరిగిన 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ప్రధాని మోదీ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా కోల్కతా ఐకానిక్ రెడ్ రోడ్లో వేలాది మంది పౌరులతో యోగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ వివిధ దేశాలు, సంస్కృతులకు చెందిన ప్రజలను ఏకం చేస్తూ యోగా ప్రపంచంలోనే అతి పెద్ద సామూహిక వేడుకగా మారిందని పేర్కొన్నారు.
కాగా, ‘ఆసనాస్’ పేరుతో మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో నిర్వహించిన యోగా దినోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భాగస్వామి అయ్యారు. దేశ వ్యాప్తంగా యోగా దినోత్సవ వేడుకల్లో ఆయా సంస్థల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, గవర్నర్లు ఉన్నారు. టోక్యో, మాస్కో, మిలాన్, షాంగై, కాన్బెర్రా తదితర ప్రాంతాల్లో కూడా యోగా ఘనంగా జరిగింది.

