తెలంగాణ:వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్‌లో(అనంతగిరి హిల్స్) ఆదివారం విషాద ఘటన.బంధువులతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లిన ప్రియ ( ప్రియా )(47) అనే మహిళ ఒక్కసారిగా అస్వస్థతకు గురై కుప్పకూలింది.
ఆమెను వెంటనే స్థానికులు,కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా,అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ట్రెక్కింగ్‌కు ఆనందంగా వెళ్లిన ప్రియ అనూహ్యంగా మృతి చెందడంతో అక్కడ విషాద ఛాయలు అలుముకుంటున్నాయి.ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

