డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసుపై రాజమహేంద్రవరం స్పెషల్ కోర్టులో రెగ్యులర్ విచారణ పరిశీలన. హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. రెండో నిందితురాలిగా ఉన్న అనంతబాబు భార్య లక్ష్మీదుర్గనూ కోర్టు ముందు ప్రవేశపెట్టారు.
డ్రైవర్ హత్య కేసులో…
డ్రైవర్ హత్య కేసులో సాక్షులను న్యాయమూర్తి విచారిస్తున్నారు. సాక్షులను బెదిరించిన కేసులో రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలన్న అన్నంతబాబు పిటిషన్‌పైనా కోర్టు విచారణ చేస్తోంది. అనంతబాబుపై పీటీ వారెంట్ జారీ చేయాలన్న పోలీసుల వినతిపై ప్రత్యేక న్యాయస్థానం నిర్ణయం తీసుకోనుంది.

