అనిల్ రావిపూడి జివి ప్రకాష్ వైరల్ వీడియో: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్స్ చాలామంది ఉన్నప్పటికి డైరెక్టర్లకు మాత్రమే మంచి గుర్తుపై ఉంది. ఇక రాజమౌళి వరుసగా 12 సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించాడు. ఇక అతని తర్వాత స్థానంలో అనిల్ రావిపూడి 9 విజయాలను సాధించి తన కంట ఒక క్రెడిబులిటిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఇప్పటివరకు అనిల్ రావిపూడి చేసిన ప్రతి సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో అతనితో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు కూడా ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఆయన వెంకటేష్, కళ్యాణ్ రామ్ లను పెట్టి ఒక సినిమా చేస్తున్నాడు. మల్టీ స్టారర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ని కూడా తను ఇచ్చాడు. జూన్ 19వ తేదీన ఈ సినిమా అఫీషియల్ గా ముహూర్తం జరుపుకోబోతుంది. ఇక దానికి ముందే అనిల్ రావిపూడి ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూర్చున్నాడు.
మొదటిసారి జీవి ప్రకాష్ తన సినిమాకి సంగీత దర్శకుడుగా తీసుకున్న అనిల్ రావిపూడి అతనితో మంచి ట్యూన్స్ ఇప్పించే ప్రయత్నం చేసాడు. అయితే దాని కోసం ఆయన విభిన్నమైన పంథాలో ప్రమోషన్స్ చేస్తున్నాడు. జంధ్యాల సినిమాలోని సుత్తి వీరభద్ర రావు చెప్పే ఫేమస్ డైలాగులైన హైదరాబాద్, సికింద్రాబాద్ అనేదాన్ని స్ఫూఫ్ గా వాడుకొని జీవి ప్రకాష్ కుమార్ ని ఇసుక లో పాతిపెట్టి మరి అతని చేత మ్యూజిక్ ని చేయించుకుంటున్నాడు.
అతనితోపాటు ఆ సాంగ్ కి లిరిక్ రైటర్ గా కొనసాగుతున్న అనంత శ్రీరామ్ ను సైతం పాతి పెట్టడం విశేషం… మొత్తానికైతే తను మ్యూజిక్ సిట్టింగ్ కోసం సంగీత దర్శకుడిని పట్టుకుని మరి వారి చేత మంచి మ్యూజిక్ ను ఇప్పించుకునే ప్రయత్నం చేసింది.
దానికి దీన్ని ఒక ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. ఇక అనిల్ ప్రమోషన్స్ కూడా చాలా బాగా చేస్తున్నాడు అంటూ ఆయన పెట్టిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వ్యూస్, లైక్స్ వస్తున్నాయి… ఇక ఈ సినిమాతో సక్సెస్ ని సాధిస్తే ఆయన వరుసగా 10 విజయాలు సాధిస్తే దర్శకుడిగా గొప్ప గుర్తింపు తెచ్చుకుంటాడు…లేకపోతే చాలా మంది ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది…

