అనిల్ రావిపూడి వెంకటేష్ కళ్యాణ్ రామ్ సినిమా: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్లకి చాలా మంచి గుర్తుపైతే ఉంది. ముఖ్యంగా అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు వరుసగా తొమ్మిది సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించి టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. స్టార్ హీరోలు, యంగ్ హీరోలు అనే తేడా లేకుండా వరసగా సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… ఈ సంవత్సరం ఇప్పటికే ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో 400 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టిన ఆయన ఇప్పుడు వెంకటేష్ – కళ్యాణ్ రామ్ లను హీరోలుగా పెట్టి మరో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమాని 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు.
ఇక ఈరోజే ఈ సినిమాకి సంబంధించిన ముహూర్తం జరిగింది. ఈ నెల 22వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ జరగబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో వెంకటేష్ కి జోడిగా కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్ కి జోడిగా కృతి శెట్టి నటిస్తుండటం విశేషం… ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మంచు విష్ణు, రాజ్ తరుణ్ లు హీరోలుగా చేసిన ‘ఈడోరకం ఆదోరకం’ అనే సినిమా లైన్ లో ఈ సినిమా చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఈ కథ కూడా కన్ఫ్యూజన్ డ్రామాగా తెరకెక్కుతుందట. అందులోనే ఫ్యామిలీ ఎమోషన్స్ అలాగే ఎలివేషన్ సన్నివేశాలు కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక అనిల్ రావిపూడి అంటే కామెడీకి పెద్ద పీట వేస్తాడు. కాబట్టి ఈ సినిమాలో కూడా కామెడీ చాలా డిఫరెంట్ వేలో ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
మరోసారి 2027 సంక్రాంతి కానుకగా అనిల్ రావిపూడి భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ఈ సినిమాతో కూడా సక్సెస్ ను సాధిస్తే వరుసగా 10 విజయాలను సాధించిన దర్శకుడిగా అనిల్ రావిపూడి సరికొత్త హిస్టరీని క్రియేట్ చేసినవాడవుతాడు…

