అనిల్ రావిపూడి మరియు సప్తగిరి: కమర్షియల్ సినిమాలకు పెట్టింది పేరుగా మారిన దర్శకుడు అనిల్ రావిపూడి… ఆయన చేసిన సినిమాలను ప్రేక్షకులకు విశేషంగా అలరిస్తున్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తున్న సినిమాలు అతనికి భారీ లాభాలను తీసుకొచ్చి పెడుతున్నాయి. ప్రస్తుతం ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో కూడా కేర్ఫుల్గా నటించాడు. ఇక వెంకటేష్ – కళ్యాణ్ రామ్ లను హీరోలుగా పెట్టి ఒక మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇక ఇలాంటిదే ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉండే విధంగా చూసుకుంటున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. అనిల్ రావిపూడి కమెడియన్ సప్తగిరి ఇద్దరు కూడా కెరియర్ స్టార్టింగ్ లో రూమ్ మేట్స్ అనే విషయం పలు సందర్భాల్లో అనిల్ రావిపూడి స్వయంగా ఇంటర్వ్యూలో తెలియజేశాడు.
మరి అనిల్ రావిపూడి సినిమాలో సప్తగిరి కి ఎందుకని ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇవ్వడం లేదనే డౌట్ ప్రతి ఒక్కరి మదిలో మెదులుతుంది. నిజానికి వాళ్ళిద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ అయిన కూడా ఇద్దరిలో ఏదో ఒక చిన్న మనస్పర్థలైతే ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. అందుకే అనిల్ రావిపూడి అతని కోసం ఒక సపరేట్ క్యారెక్టర్ రాయలేకపోతున్నాడు.
సప్తగిరి సైతం అతని సినిమాల్లో పేరుకు నేను నటిస్తాను అని చెబుతున్నప్పటికి అనిల్ సినిమాలో చేయడం అతనికి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేనట్టుగా ఉంది. అందువల్లే వీళ్ళిద్దరూ కలిసి వర్క్ చేయడం లేదు లేకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ సునీల్ లాంటి ఫ్రెండ్స్ ఎంత బాగా కలిసిపోయి ఉంటారు.
ఇప్పటికీ త్రివిక్రమ్ తన ప్రతి సినిమాలో సునీల్ కి మంచి క్యారెక్టర్ ని ఇస్తున్నాడు. కెరియర్ స్టార్టింగ్ లో అతని కెరియర్ ను నిలబెట్టింది కూడా త్రివిక్రమే కావడం విశేషం. ఇక ప్రస్తుతం సునీల్ డౌన్ లో ఉన్నప్పటికి తన సినిమాలలో మంచి క్యారెక్టర్లు ఇస్తూ ఎంకరేజ్ చేస్తున్నాడు. ఫ్రెండ్షిప్ అంటే ఇలా ఉండాలి. కానీ అనిల్ రావిపూడి – సప్తగిరి లా ఉండకూడదు అంటూ మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు…

