విశాలాంధ్ర ధర్మవరం;; అన్నదానం చేయుటలో ఎంతో సంతృప్తి ఉంది అని కొత్తపేటలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయంలో నిత్యం పూజలను అర్చకులు సుదర్శనాచార్యులు చేశారని తెలిపారు. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా ప్రతిరోజు దాదాపు నూరు మందికి పైగా అనాధలకు, పేదలకు, బిక్షగాళ్లకు దాతల సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమంలో 100 రూపాయల నుంచి ఆపై ఇచ్చే ప్రతి భక్తుల వద్ద నగదు తీసుకొని రసీదును ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. ప్రతి ఒక్కరూ దైవభక్తిని పొందాలని, మానవ సేవకు శ్రీకారం చుట్టాలని వారు తెలిపారు.

