తమిళనాడు కీలక నేత అన్నామలై బీజేపీకి రాజీనామా చేశారు. అన్నామలై రాజీనామాను బీజేపీ నాయకత్వం ఆమోదించింది. మరికాసేపట్లో అన్నామలై తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన అన్నామలై శాసనసభ ఎన్నికలకు ముందు పదవి నుంచి తప్పించుకున్నారు.
నేడు కీలక ప్రకటన…
అన్నాడీఎంకే తో పొత్తును అన్నామలై వ్యతిరేకించారు. దీంతో ఆయన ఇటీవల ఢిల్లీకి వెళ్లి బీజేపీ అగ్రనేతలను కలసి తన రాజీనామాను ప్రకటించి వచ్చారు. తమిళనాడులో అన్నామలై కొత్త పార్టీ పెట్టి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నేడు ఆయన చేసే ప్రకటన ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా ఉంది.

