బీజేపీకి రాజీనామా చేసిన తమిళనాడు నేత అన్నామలై సంచలన ప్రకటన చేశారు. తమిళనాడులో తాను కొత్త పార్టీ పెట్టబోతున్నానని అన్నామలై చెప్పారు. ఆయన మీడియా సమావేశంలో మార్పు కోసమే తాను బీజేపీలో చేరానని అన్నామలై అన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చే ముందు సూపర్ స్టార్ రజనీకాంత్ తో మాట్లాడానని అన్నామలై అన్నారు. ఆయన సలహాలు తీసుకున్నానని చెప్పారు.
రాజకీయ ఉద్యమం…
బీజేపీ భవిష్యత్ కోసం తాను ఎంతో చేశానని చెప్పారు. తమిళనాడులో మరొకరికి అవకాశం ఉందని అన్నామలై అభిప్రాయపడ్డారు. తమిళనాడులో తాను ఇక రాజకీయ ఉద్యమం మొదలుపెట్టబోతున్నట్లు అన్నామలై నిప్పులు చెరిగారు. తమిళనాడు అభివృద్ధి తన ధ్యేయమేని అన్నామలై చెప్పారు. తమిళనాడు భవిష్యత్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అన్నామలై సోషల్ మీడియా వేదిక ద్వారా తెలిపారు.

