తమిళ సూపర్ స్టార్ , ముఖ్యమంత్రి దళపతి విజయ్ నటించిన ‘జన నాయకన్’ చివరి చిత్రం చూసి స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఇన్నాళ్లు సినిమా హీరోగా తనకు స్ఫూర్తిగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా ఎమోషన్ పోస్ట్ చేశాడు.
‘విజయ్ అన్న..ఇన్నేళ్లు హీరోగా మమ్మల్ని అలరించినందుకు ధన్యవాదాలు. మీ ‘కాదలుక్కు మరియధై’ సినిమాతో మీకు నేను అభిమానిని అయ్యాను. నా ఎదుగుదలలో మీరు చాలా కీలకం. హీరోగా మిమ్మల్ని చాలా మిస్ అవుతాను. లవ్ యూ అన్నా.
జననాయకన్.. అద్భుతమైన ఫేర్వెల్ మూవీ. ప్రతి క్షణాన్ని ఎంతో ఆస్వాదించాను. ఇన్ని ఫ్యాన్ మూమెంట్స్‌తో ఈ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ హెచ్ వినోద్, చిత్ర బృందానికి అభినందనలు’అని వరుణ్ చక్రవర్తీ ఎమోషనల్ అయ్యాడు.
ప్రస్తుతం తొడకండరాల గాయంతో ఇబ్బంది పడుతున్న వరుణ్ చక్రవర్తీ.. దూరంగా ఉన్నాడు. ఇంగ్లండ్ పర్యటన మధ్యలో తప్పుకున్న అతను జింబాబ్వే పర్యటనకు కూడా దూరమయ్యాడు. ఆసియా గేమ్స్‌తో అతను మళ్లీ భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇంటిదగ్గరే ఉన్న వరుణ్ చక్రవర్తీ త్వరలోనే బీసీసీఐ సెంట్రల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్(సీఓఐ)లో చేరి రిహాబిలిటేషన్ తీసుకోనున్నాడు. వరుణ్ చక్రవర్తీ స్థానంలో రవి బిష్ణోయ్‌ను సెలెక్టర్లు జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేశారు.
తమిళనాడు అసెంబ్లీ దళపతి విజయ్ అధికారాన్ని టీవీకే పార్టీ భారీ విజయం సాధించి సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన విజయ్ సినిమాలకు దూరంగా ఉంటానని ప్రకటించాడు. దాంతో ఆయన నటించిన ఆఖరి చిత్రం ‘జన నాయకన్’ చూసి అభిమానులు తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. విజయ్ వీరాభిమాని అయిన వరుణ్ చక్రవర్తి కూడా సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
జింబాబ్వే పర్యటనలో ఉన్న భారత జట్టు మూడు టీ20ల సిరీస్‌లో శుభారంభం చేసింది. హరారే వేదికగా గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన భారత్ 7 వికెట్ల తేడాతో జింబాబ్వేను ఓడించింది. ఏడు టీ20ల తర్వాత తొలి విజయాన్ని అందుకుంది. రెండో టీ20 శనివారం జరగనుంది.
కథనం మొదట ప్రచురించబడింది: శుక్రవారం, జూలై 24, 2026, 16:20 (IST)
ఇతర కథనాలు ప్రచురించబడ్డాయి జూలై 24, 2026

