ఏమైందో ఏమో.. ఓ కోతి సడెన్ గా రోడ్డుపై పడిపోయింది.. అపాస్మారక స్థితిలోకి వెళ్లింది. వారంతా చనిపోయిందని అనుకున్నారు.కానీ ఎవరూ దగ్గరికి వెళ్లే సాహసం చేయలేదు. అయితే ఓ ఇద్దరు వ్యక్తులు మాత్రం మానవత్వంతో దగ్గరికి వెళ్లి బతికి ఉందని తెలిసి కాపాడే ప్రయత్నం చేశారు. మనుషులకు అలాగే ఆ కోతికి సీపీఆర్ చేశారు. దాదాపు మూడు నిమిషాల పాటు శ్రమించినందుకు ఫలితం దక్కింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కోతి లేచి కూర్చుంది. సాధారణంగా పరుగులు పెట్టింది.ఇదంతా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అవుతోంది. ఎక్కడ జరిగిందో స్పష్టత లేదుగానీ.. ఆ ఇద్దరు మానవత్వం గలు చేసిన పనిని మెచ్చుకుంటున్నారు. వారికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
ఈ వీడియో నెటిజన్లు ఆ ఇద్దరిని చూసిన మానవత్వాన్ని ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు. మాటలు చెప్పలేని మూగజీవికి సమయానికి సహాయం చేయడం నిజమైన మానవత్వం.. వారి చొరవ వల్లే ఆ కోతి ప్రాణాలతో బయటపడింది అంటూ ప్రశంసలు కురిపించారు. సరైన సమయంలో స్పందించి ఓ మూగజీవికి జీవితం పోసిన ఆ ఇద్దరి చర్య ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.
ఇద్దరు దయగల వ్యక్తులు రోడ్డు పక్కన సకాలంలో CPR చేయడం ద్వారా అపస్మారక స్థితిలో ఉన్న కోతి ప్రాణాన్ని కాపాడారు. మానవత్వం మరియు శీఘ్ర ఆలోచన యొక్క ఈ హృదయపూర్వక చర్య సోషల్ మీడియాలో హృదయాలను గెలుచుకుంటుంది. pic.twitter.com/5tfTngULVh
— ధర్మ్ సేన 🚩 (@Dharmsena_1) జూలై 8, 2026

