దృశ్యం 3 OTT విడుదల: ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై , బాక్స్ ఆఫీస్ వద్ద డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న ప్రతిష్టాత్మక చిత్రాలలో ఒకటి ‘దృశ్యం 3’. మలయాళం తో పాటు , తెలుగులో కూడా ఈ చిత్రం విడుదలకు ముందు మంచి క్రేజ్ ఉండేది. ఎందుకంటే తెలుగులో వెంకటేష్ చేసిన ‘దృశ్యం’ సిరీస్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది కాబట్టి. కానీ అంచనాలకు తగ్గట్టుగా సినిమా లేకపోవడంతో ఆడియన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. కానీ సినిమాకు కమర్షియల్ గా కాసుల కనకవర్షం భారీగానే కురిసింది. ట్రేడ్ విశ్లేషకులు అందించే సమాచారం ప్రకారం చూస్తే ఈ నమోదిత ఇప్పటి వరకు 240 కోట్ల రూపాయల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చాయి. థియేట్రికల్ రైట్స్ కేవలం 30 కోట్ల రూపాయలకే అమ్మారు. బాక్స్ ఆఫీస్ పరంగా ఈ చిత్రం బయ్యర్స్ కి డబుల్ ప్రాఫిట్స్ వచ్చాయి.
తెలుగు వెర్షన్ కూడా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంది. ఇలాంటి సమయాల్లో ఈ ఓటీటీ లో విడుదల చేయడానికి రెడీ అయ్యారు మేకర్స్. విడుదలకు ముందు ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ సంస్థ భారీ రేట్ కి కొనుగోలు చేసింది. గతం లో తెలుగు , మలయాళం దృశ్య , హిందీ వెర్షన్స్ కి సంబంధించిన సిరీస్ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో లోనే స్ట్రీమింగ్ అయ్యింది. ఇప్పుడు ‘దృశ్యం 3’ రైట్స్ కూడా అమెజాన్ ప్రైమ్ సంస్థ సొంతం చేసుకుంది. ఒప్పందం ప్రకారం ఈ చిత్రం ఈ నెల 18 వ తారీఖున లేదా, 25 తారీఖున స్ట్రీమింగ్ అవ్వాలి. కానీ మేకర్స్ ఇంకా అధికారిక ప్రకటన రాలేదు . ఈ వారంలోనే ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ కి సంబంధించిన అప్డేట్ ని అధికారికంగా ప్రకటించబోతున్నారు మేకర్స్.
అయితే ఈ చిత్రం హిందీ బాషా మినహా, మిగిలిన అన్ని భాషల్లోనూ స్ట్రీమింగ్ ఉంది. హిందీ లో ఎందుకు స్టెమ్మింగ్ అవ్వడం లేదంటే , ఈ సినిమా హిందీ లో గ్రాండ్ గా తెరకెక్కుతుంది కాబట్టి . అజయ్ దేవగన్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. మొదటి రెండు పాత్రల్లో హీరోయిన్ గా నటించిన శ్రియ శరన్ ఈ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ‘దృశ్యం 3’ హిందీ వెర్షన్ , ఈ ఏడాది లోనే విడుదల కాబోతుంది. ఇక మలయాళం వెర్షన్ విషయానికి వస్తే , థియేటర్స్ నుండి డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం , ఓటీటీ ఆడియన్స్ నుండి ఎలాంటి టాక్ రాబోతుందో చూడాలి.

