రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ ఉన్నారు. కొండవీటి వాగు అభివృద్ధి పనులను పరిశీలించారు. N9,N8,N7 రోడ్లలో కొండవీటి వాగుపై నిర్మాణం బ్రిడ్జి పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. వంతెన నిర్మాణాల నివేదికపై అధికారులతో సమీక్ష జరిగింది.
కొండవీటు వాగుకు...
బ్రిడ్జిల కింద కొండవీటి వాగు ప్రవాహానికి ఆటంకం లేకుండా మట్టి తొలగించాలని అధికారులకు మంత్రి నారాయణ ఆదేశాలు జారీ చేశారు. కొండవీటి వాగు వెడల్పు తక్కువగా ఉన్నచోట మరింత వెడల్పు చేయాలని మంత్రి నారాయణ సూచించారు. నీరుకొండ లో నిర్మాణం రిజర్వాయర్ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు.

