15 కోట్ల వైసీపీ కుట్ర బట్టబయలు: అమరావతి ఏర్పాటు సమయంలో తాము రాజధానికి అనుకూలమని నాడు వైసిపి అధినేత హోదాలో ఉన్న జగన్ చెప్పారు. రాజధాని కోసం ఏర్పాటు చేసిన సభకు ఆహ్వానం పలికలేదు. తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి విషయంలో మూడు నాలుకల ధోరణి ప్రదర్శించాడు. ఏకంగా ఏపీకి మూడు రాజధానులు అన్నారు. చివరికి విశాఖపట్నం క్యాపిటల్ అంటూ ప్రకటన చేశాడు. దేని పై కూడా క్లారిటీగా జగన్ నిలబడలేదు. కనీసం తాను చెప్పిన త్రీ క్యాపిటల్స్ కూడా అమలు చేయలేదు. ఇప్పుడు కొత్తగా మావిగన్ అనే పదాన్ని తెరపైకి తీసుకొచ్చాడు.
అమరావతి విషయంలో వైసీపీ మొదటి నుంచి కూడా వ్యతిరేక ధోరణిని ప్రదర్శిస్తోంది. అమరావతిని కేవలం ఒక కులానికి సంబంధించిన రాజధానిగా మాత్రమే చూస్తోంది. ఇప్పటికీ ఒక కులం వారికే అధికంగా భూములు కేటాయించారని.. దీని వెనుక ఇన్సైడ్ ట్రేడింగ్ ఆరోపిస్తోంది. ఇంతటితోనే వైసీపీ ఆగలేదు. రాజధాని విషయంలో మరింత విషం చిమ్మడానికి గతంలో అనేక రకాల ప్రయత్నాలు చేసింది. అవి ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అమరావతి విషయంలో వైసిపి తీసుకున్న స్టాండ్.. దానికోసం తెర వెనుక చేసిన ప్రయత్నాలు.. ఇప్పుడు వెలుగులోకి రావడంతో ఏపీ రాజకీయాలలో కలకలం.
పులివెందుల టిడిపి ఇన్చార్జిగా కొనసాగుతున్న బీటెక్ రవి వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం..” శాసనమండలిలో అమరావతికి వ్యతిరేకంగా మద్దతు ఇస్తే 15 కోట్లు ఇస్తామన్నారు.సిబిఐకి ఫిర్యాదు చేసిన కేసును వెనక్కి తీసుకుంటే బ్లాగ్ చెక్ చేయనున్నారు. నాడు పదిహేను కోట్లు కావాలని చెప్పింది విజయసాయిరెడ్డి. ఆదినారాయణ రెడ్డి వద్దకు అవినాష్ రెడ్డి మనసులు వచ్చాయి. బ్లాంక్ ఇస్తాం.. ఎన్ని కోట్లయినా రాసుకోండి.. కేసు మొత్తం విత్ డ్రా కావాలని కోరారని” బీటెక్ రవి చెప్పారు
అమరావతి విషయంలోనే కాకుండా.. వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా బీటెక్ రవి సంచలన విషయాలు వెల్లడించిన నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు మరో టర్ను తీసుకునే అవకాశం. ఇప్పటికే రాజారెడ్డి వ్యవహారంపై ఏపీ రాజకీయాలు అట్టుడికి పోతున్నాయి. రాజశేఖర్ రెడ్డి గురించి కూడా టిడిపి నేతలు పదేపదే విమర్శలు చేస్తున్నారు. ఇటీవల రాజశేఖర్ రెడ్డి మరణాన్ని.. రాజారెడ్డి మరణాన్ని జగన్ తెరపైకి తీసుకొచ్చారు. వారి చావులకు టిడిపి, చంద్రబాబు కారణం అన్నట్టుగా చెప్పారు. ఆ తర్వాత టిడిపి శ్రేణులు కూడా గట్టి కౌంటర్ ఇవ్వడం మొదలైంది. ఇప్పుడు బీటెక్ రవి ఏకంగా అమరావతి గురించి.. వివేకానంద రెడ్డి మరణం గురించి.. తనకు అందిన ఆఫర్ల గురించి చెప్పారు. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాలు ఇంకా ఎలా మారుతాయో చూడాల్సి ఉంది.

