అమరావతిపై టాలీవుడ్ మౌనం: అమరావతి రాజధాని నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. మొన్నటి వరకు ఏపీ రాజధాని ఏది అంటే చెప్పుకునే పరిస్థితిలో ప్రజలు ఉండేవారు కాదు. కానీ ఇప్పుడు మాత్రం సగర్వంగా చెప్పుకుంటున్నారు అమరావతి అని. అందుకు తగ్గట్టుగానే అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే అమరావతిలో 70 ప్రభుత్వ రంగ సంస్థలు నిర్మితమవుతున్నాయి. అందులో బ్యాంకులు కూడా ఉన్నాయి. మరో నాలుగు వరకు ప్రైవేటు యూనివర్సిటీలు, ఆస్పత్రుల నిర్మాణం జరుగుతోంది. అయితే అమరావతి ఔన్నత్యాన్ని గుర్తించిన బాలీవుడ్ సంస్థలు అమరావతిలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. భవిష్యత్తులో దక్షిణాది రాష్ట్రాల్లో అమరావతి అద్భుత నగరంగా మారుతుందని అంచనా వేస్తున్నారు బాలీవుడ్ ప్రముఖులు. అందుకే సంజయ్ దత్ లాంటివారు అమరావతికి వచ్చి.. ప్రభుత్వంతో చర్చలు జరిపి తన ఆసక్తిని బయటపెట్టారు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా సానుకూలత చూపారు. అయితే ఆయన ఒక్కరే కాదు బాలీవుడ్ ప్రముఖ సంస్థలు అమరావతిలో భూములు కేటాయించాలని కోరుతూ దరఖాస్తులు చేసుకుంటున్నారు. అయితే వాటికి భూముల కేటాయింపుకు సంబంధించిన నిర్ణయాలు ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
మర్యాదపూర్వకంగా కలవలే..
అమరావతిని బాలీవుడ్ గుర్తించింది కానీ.. టాలీవుడ్ మాత్రం గుర్తించడం లేదు. అసలు ఏపీనే టాలీవుడ్ లెక్కచేయడం లేదు. ఏపీ పాలకుల విషయంలో కూడా అలానే ఉంది చిత్ర పరిశ్రమ పరిస్థితి. ఏపీ సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలుమార్లు సూచించారు. కానీ ఇంతవరకు తెలుగు చిత్ర ప్రముఖులు వచ్చి సీఎం చంద్రబాబును కలిసిన పరిస్థితి లేదు. కనీసం అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ముందుకు రావడం లేదు తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు.
పెట్టుబడులు పెడితే మంచిది..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మావిగన్ అంటూ పిచ్చి ప్రతిపాదన చేస్తోంది. దానిని పట్టుకునే పరిస్థితి ఎవరికీ లేదు. పైగా ప్రజలు కూడా పెద్దగా ఆహ్వానించడం లేదు. అమరావతికి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కూడా కల్పించింది. దీనిని గుర్తించిన ఎక్కడో ఉన్న బాలీవుడ్ పరిశ్రమ అమరావతికి వచ్చేందుకు సిద్ధపడింది. కానీ ఇక్కడ టాలీవుడ్ వ్యాపారం చేస్తూ లాభాలు ఆర్టిస్తున్న మాత్రం అమరావతి ముఖం చూడడం లేదు. ఇది ఎంత మాత్రం సహేతుకం కాదు. అమరావతి విషయంలో ఇప్పటికైనా తెలుగు చిత్ర పరిశ్రమ ఒక నిర్ణయానికి రావాలి. తెలుగు చిత్ర పరిశ్రమ అంటే హైదరాబాద్ అనే మాట దాటి ఏపీ వైపు విస్తరించాల్సిన అవసరం ఉంది.

