భారతదేశంలో ISI ఏజెంట్లు: సరిహద్దుల్లో మారణ హోమం సృష్టిస్తూ ఉంటుంది. మన సైనికులపై దాడులు జరుగుతున్నాయి. ప్రశాంతమైన మనదేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. నకిలీ నగదు.. మాదకద్రవ్యాలు.. మత్తు పదార్థాలు.. ఇలా అనేక రకాలుగా అకృత్యాలకు గురవుతాయి. అందువల్లే పాకిస్తాన్ ఐఎస్ఐ ని అత్యంత దుర్మార్గమైన గూడచార వ్యవస్థ అని పిలుస్తూ ఉంటారు.
ఈ సంస్థ మనదేశంలో చేయని దారుణం అంటూ లేదు. అయితే తాజాగా మన నిఘా వ్యవస్థలు అత్యంత పట్టిష్టంగా మారిపోయాయి. సరిహద్దుల్లో నకిలీ నగదు రవాణాకు అడ్డుకట్టపడింది. మాదకద్రవ్యాలను.. మత్తు పదార్థాలను దేశంలోకి రానివ్వకుండా తొక్కిపెట్టేశారు. ఇదంతా కూడా ఐ ఎస్ ఐ కి ఇబ్బందికర వాతావరణం కలిగించింది. ఈ నేపథ్యంలో ఐఎస్ఐ మరో దుర్మార్గమైన విధానానికి దారితీసింది. హిందువులను హిందువులతోనే అంతం చేసే కుట్రకు దారితీసింది. అమాయకమైన హిందువులను లక్ష్యంగా చేసుకొని.. వారిని గూడచారులుగా మార్చడం మొదలుపెట్టింది.
మే 8, 2026 నాటికి ఆపరేషన్ సిందూర్ ముగిసి ఒక సంవత్సరం అయింది. ఈ నేపథ్యంలో దాదాపు 17 రాష్ట్రాల్లో 457 మంది అమాయకపు హిందువులు గూఢచర్యానికి గురవుతున్నట్లు అభివర్ణించారు. వారంతా కూడా అరెస్టు అయ్యారు. వీరంతా కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారు. అమాయకపు హిందువులకు పాకిస్తాన్ ఏజెంట్లు సోషల్ మీడియాలో మహిళల పేరుతో పరిచయం అయ్యేవారు. డబ్బులు ఎర్రగా చూపించేవారు. కొన్ని సందర్భాల్లో భావోద్వేగమైన బ్లాక్ మెయిల్ పంపేవారు. వీరి ద్వారా దేశంలోని ఆర్మీ కంటోన్మెంట్లు.. డిఆర్డిఓ గెస్ట్ హౌస్ లు.. కీలకమైన నిర్మాణ వంటి వాటి వద్ద సిసిటీవీ కెమెరాలను ఏర్పాటు చేయించారు. ఈ వారి ఆధీనంలో పనిచేసే ఉగ్రవాదులకు చేరవేసేవారు.
అమాయకపు హిందువులు తాము చేస్తున్నది దేశద్రోహం అని తెలియకుండానే ఆ ఊబిలో చిక్కుకుని పోయేవారు. కేవలం డబ్బు కోసమే ఐ ఎస్ ఐ ఏజెంట్ల మాటలు నమ్మిపోయేవారు.. 2008 నాటి ముంబయి దాడుల్లో ఉగ్రవాదులు ఎలా హిందువుల పేర్లు పెట్టారు. అయితే దేశంలో వ్యతిరేక బృందాలు దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఐఎస్ఐ ఆకృత్యాలు బయట పడుతున్నాయి.

