ఢిల్లీ: భారత్, అమెరికా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు అని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కొనియాడారు. గల్ఫ్ సంక్షేభం, రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై చర్చిస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో భారత్, అమెరికా విదేశాంగ మంత్రుల మీడియా సమావేశం జరిగింది. ఉగ్రవాదంపై భారత్, అమెరికా కలిసి నడుస్తోంది, భారత్, అమెరికా ఉగ్రవాద బాధిత దేశాలు అని తెలియజేశారు. భారత్ లో ఉండటం గర్వకారణమని రూబియో ఆనందాన్ని వ్యక్తం చేశారు.
త్వరలో అమెరికా బృందం భారత్ కు రాబోతుందని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. ఒప్పందంలోని కొన్ని అంశాల భారత్ అభ్యంతరం చెబుతోందని, అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయని అన్నారు. అక్రమ వలసలకు తాము పూర్తిగా వ్యతిరేకం అని 140 కోట్ల భారతీయుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని తెలియజేశారు. అమెరికా వీసా, ట్రేడ్ డీల్ పైనా ఇబ్బందులపై, అణువిద్యుత్ అంశంలో సహకారంపై చర్చిస్తామని జైశంకర్ పేర్కొన్నారు.

