అమెరికాలో తెలంగాణకు చెందిన విద్యార్థి అనురూప్ రెడ్డి మరణించారు. లూసియానాలో ఈ ఘటన చోటు చేసుకుంది. టోరోడో పార్క్ లో ఉన్న సెబాన్ నదిలో కలసి ఈతకు వెళ్లాడు. అయితే అతని స్నేహితులు లోతుకు వెళ్లే సమయంలో అనురూప్ రెడ్డి వారిని రక్షించే ప్రయత్నం చేశారు. వారిముగ్గురిని బయటకు తీసుకు వచ్చిన అనురూప్ రెడ్డి తాను కూడా ఒడ్డుకు వచ్చే సమయంలో కాలికి ఫిషింగ్ వైర్ చుట్టుకుంది.
మాస్టర్స్ చేస్తున్న…
దీంతో అనూప్ రెడ్డి నీటిలో నుంచి పైకి రావడం కష్టంగా మారి మృతి చెందినట్లు స్నేహితులు చెబుతున్నారు. అనురూప్ రెడ్డిది అబ్దుల్లాపూర్ మెట్ మండలం కావడిపల్లి గ్రామానికి చెందిన రియల్టర్ రాజేంద్ రెడ్డి కుమారుడు. నార్త్ టెక్సాస్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. అనురూప్ రెడ్డి మృతితో కుటుంబంలోనూ, గ్రామంలోనూ విషాదం.

